హీరో రవితేజ ఇంట్లో విషాదం..

హీరో రవితేజ ఇంట్లో విషాదం..

ప్రముఖ నటుడు రవితేజ ఇంట్లో విషాదం నెలకొంది. రవితేజ తండ్రి భూపతి రాజు రాజగోపాల్ రాజు జులై 15న రాత్రి (90)కన్నుమూశారు.గత కొంత కాలంగా అనారోగ్యకారణాలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని రవితేజ ఇంట్లో తుదిశ్వాస విడిచారు. రవితేజ తండ్రి ఫార్మసిస్ట్ గా పనిచేశేవాడు.

భూపతి రాజు రాజగోపాల్ రాజుకు ముగ్గురు కుమారులు, రవితేజ,రఘు,భరత్. వీరిలో భరత్ 2017 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రవితేజ తండ్రి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం  ప్రకటించారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.