దుబాయ్: టీమిండియాస్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ ర్యాంక్‌లోనే కొనసాగుతున్నాడు. బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో అశ్విన్ ఖాతాలో 860 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో అశ్విన్ ఖాతాలో 860 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.
జేమ్స్ అండర్సన్ (829), రబాడ (825) వరుసగా రెండు, మూడు ప్లేస్ల్లో ఉండగా, యాషెస్ తొలి టెస్ట్ హీరో ప్యాట్ కమిన్స్ (824) నాలుగో ర్యాంక్‌కు పడిపోయాడు. బుమ్రా (772), జడేజా (765) ర్యాంక్‌లో ఎలాంటి మార్పుల్లేకుండా 8, 9 ప్లేస్ల్లోనే ఉన్నారు. బ్యాటింగ్‌లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ (887) ఐదు ప్లేస్‌లు మెరుగై మళ్లీ నంబర్ వన్ ర్యాంక్‌లోకి దూసుకొచ్చాడు. విలియమ్సన్ (883) రెండులో ఉండగా, లబుషేన్ (877), ట్రావిస్ హెడ్ (873) మూడు, నాలుగు ర్యాంక్‌లకు పడిపోయారు. ఇండియా నుంచి రిషబ్ పంత్ (758) ఒక్కడే పదో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఆల్రౌండర్లలో జడేజా (434) టాప్ ప్లేస్‌లో ఉన్నాడు.