
మాస్ మహారాజ రవితేజ(Raviteja) హీరోగా వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageshwararao). దర్శకుడు వంశీ(Vamshi) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నపూర్ సనన్(Nupur sanon) హీరోయిన్ గా నటిస్తోంది. ఫస్ట్ లుక్ అండ్ గ్లింప్స్ తో ఆసక్తిని పెంచేసిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. రవితేజ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నారు.
ఇక చాలా రోజులుగా ఈ సినిమా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. టైగర్ నాగేశ్వరరావు నుండి మోస్ట్ అవైటెడ్ అప్డేట్ ని ఈరోజు(ఆగస్టు 12) సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి అయితే రివీల్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. క్నీ ఆ అప్డేట్ ఏంటా అనేది మాత్ర రివీల్ చేయలేదు మేకర్స్.
You've seen a glimpse into his world, it is now time to witness the TIGER'S ROAR ???#TigerNageswaraRao's MOST AWAITED ANNOUNCEMENT today at 4:05 PM ❤️?
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) August 12, 2023
Stay tuned ?@RaviTeja_offl @DirVamsee @AbhishekOfficl @AnupamPKher #RenuDesai @NupurSanon @gaya3bh @Jisshusengupta… pic.twitter.com/8FQeeCl99o
కాగా టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో రేణు దేశాయ్ కీ రోల్ లో కనిపించనున్నారు. చాలా కాలం తరువాత కనిపిస్తున్నారు రేణు దేశాయ్. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాలో ఆమె పాత్ర చాల కీలకం కానుందని సమాచారం. ఈ సినిమాను తమిళ సంగీత దర్శకుడు జివి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా.. దసరా కానుకగా రిలీజ్ కానుంది.