రావల్​గావ్ చాక్లెట్ బ్రాండ్స్​ రిలయన్స్ చేతికి

 రావల్​గావ్ చాక్లెట్ బ్రాండ్స్​ రిలయన్స్ చేతికి

న్యూఢిల్లీ: చాక్లెట్లు, స్వీట్లు తయారు చేసే రావల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గావ్  ట్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, వంటకాలు,  అన్ని ఇంటెలెక్చువల్​ ప్రాపర్టీ రైట్స్​ను రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ (ఆర్​సీపీఎల్​) రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. రావల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గావ్​కు పాన్ పసంద్,  కాఫీ బ్రేక్ వంటి తొమ్మిది మిఠాయి బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయి.

కాంపా కూల్​డ్రింక్స్​ బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొనుగోలు చేసినట్లుగానే, కష్టాల్లో ఉన్న పాత భారతీయ బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను కొనుగోలు చేసి, వాటిని మళ్లీ ప్రారంభించాలనేది ఆర్​సీపీఎల్​ వ్యూహం. కొనుగోలు కోసం ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదిరింది.  అయితే ఆస్తి, భూమి, ప్లాంట్, భవనం, పరికరాలు, యంత్రాలు మొదలైన అన్ని ఇతర ఆస్తులు రావల్​గావ్​ వద్దే ఉంటాయి.  2022–-23లో రావల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గావ్ ఆదాయం రూ. 9.66 కోట్లు ఉంది.