
ఆర్బీఐ మరోసారి కీలక వడ్డీరేట్లను తగ్గించింది. రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ ఏడాదిలో ఇలా రెపో రేటు తగ్గించడం ఇది ఐదోసారి. ఇప్పటి వరకు మొత్తం 135 పాయింట్లు తగ్గించింది. దీంతో రెపో రేటు 5.15 శాతానికి చేరుకుంది. ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ద్రవ్యోల్బణం కంట్రోల్ లోనే ఉండడంతో మరికొంత రేట్లు తగ్గిస్తామని ఇప్పటికే ఆర్బీఐ గవర్నర్ సంకేతాలిచ్చారు. ఆ ప్రకారమే ఇవాళ మరోసారి రెపో రేట్లు తగ్గించారు. రివర్స్ రెపో రేటును 4.90 శాతం, బ్యాంక్ రేట్ ను 5.40 శాతంగా నిర్ణయించారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి జీడీపీని 6.9 శాతం నుంచి 6.1 శాతానికి సవరించారు. అలాగే 2020-21 సంవత్సరానికి జీడీపీ అంచనాను ఆర్బీఐ 7.2కు సవరించింది.