
ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు శుభవార్త చెప్పింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI). ముంబై ప్రధానకేంద్రంగా RBI… జూనియర్ ఇంజనీర్ (సివిల్/ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి అర్హులైన అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా సూచించింది.
.. మొత్తం పోస్టుల సంఖ్య: 48
..పోస్టుల వివరాలు: జూనియర్ ఇంజనీర్(సివిల్)-24, జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)-24.
..జూనియర్ ఇంజనీర్(సివిల్) అర్హత: 65 శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా/55 శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
..వయసు: 01.02.2021 నాటికి 20-30ఏళ్ల మధ్య ఉండాలి. 02.02.1991- 01.02.2021 మధ్య జన్మించి ఉండాలి. SC/STలకు ఐదేళ్లు,OBCలకు మూడేళ్లు, PWDలకు 10ఏళ్ల గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
.. జూనియర్ ఇంజనీర్(ఎలక్ట్రికల్) అర్హత: కనీసం 65 శాతం మార్కులతో ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా/55శాతం మార్కులతో ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
..ఏజ్ లిమిట్: 01.02.2021 నాటికి 20-30ఏళ్ల మధ్య ఉండాలి. 02.02.1991-01.02.2021 మధ్య జన్మించి ఉండాలి. SC/STలకు ఐదేళ్లు, OBCలకు మూడేళ్లు, PWDలకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
.. ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
.. పరీక్షా విధానం: ఆన్‌లైన్ పరీక్ష 300 మార్కులకు ఉంటుంది. నెగిటివ్ మార్కులు ఉంటాయి. ఈ పరీక్ష ఇంగ్లిష్, హిందీ లాంగ్వేజ్ ల్లో నిర్వహిస్తారు.
..పరీక్షా సమయం: 150 నిమిషాలు.
.. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్(ఎల్‌పీటీ): ఆన్‌లైన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఎల్‌పీటీకి ఎంపిక చేస్తారు. జోన్ ఆధారంగా అఫీషియల్/లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో సాధించిన మెరిట్ ఆధారంగా ఫైనల్ ఎంపిక జరుగుతుంది.
.. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు
.. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 15.02.2021
.. పరీక్ష తేది: 08.03.2021
.. వెబ్‌సైట్: www.rbi.org.in
మరింత సమాచారం కోసం: official notification. Here’s the direct link to apply online.