
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(RBI) కీలక నిర్ణయం తీసుకుంది. ATMలో డబ్బులు లేకుండా ఉంటే వాటికి సంబంధించిన బ్యాంకులకు జరిమానా విధించనుంది. దీని సంబంధించి నిర్ణయం తీసుకుంది. కస్టమర్ల సౌకర్యం కోసం దాదాపు ప్రతీ ఏరియాలో ఆయా బ్యాంకులకు సంబంధించిన ATM లను ఏర్పాటు చేశాయి. దీంతో కస్టమర్లకు బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ATMను ఆశ్రయిస్తున్నారు. అయితే అందులో క్యాష్ లేక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
కస్టమర్లు పడుతున్న కష్టాలను తీర్చేందుకు RBI ఈ కొత్త చర్యకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. చిన్న చిన్న పట్టణాల్లో, గ్రామాల్లో చాలా వరకు ATMలు ఎప్పుడూ క్యాష్ లేకుండానే ఉంటున్నాయి. దీంతో ఆయా బ్యాంకుల కస్టమర్లు తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారు. ఇటీవల RBI ఏటీఎంల నిర్వహణపై ఓ కమిటీ వేసింది. ఏవైనా ATMలు 3 గంటల కన్నా ఎక్కువ సమయం క్యాష్ లేకుండా ఉంటే వాటికి జరిమానా విధించాలని RBI నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.