వడ్డీ రేట్లు పెంచనున్న ఆర్‌‌బీఐ!

వడ్డీ రేట్లు పెంచనున్న ఆర్‌‌బీఐ!

న్యూఢిల్లీ: రెండు నెలలకు ఒకసారి జరిగే ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ (ఎంపీసీ) సోమవారం ప్రారంభమైంది. మీటింగ్  వివరాలను ఈ నెల 7 న  ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటిస్తారు. ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 6.77 శాతానికి తగ్గడంతో మానిటరీ పాలసీని సులభం చేస్తారనే అంచనాలు పెరిగాయి. ఈసారి రెపో రేటును 25–35 బేసిస్ పాయింట్ల వరకు ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ పెంచొచ్చని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు.

ఈ ఏడాది జూన్ నుంచి చూస్తే రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు చొప్పున మూడు సార్లు పెంచారు. అంతకు ముందు 40 బేసిస్ పాయింట్లను సడెన్‌‌‌‌‌‌‌‌గా పెంచారు. డిసెంబర్ పాలసీ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో  వడ్డీ రేట్లను ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ తక్కువగా పెంచుతుందని స్టేట్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్  చీఫ్ ఎకనామిస్ట్ సౌమ్య కాంతి ఘోష్ అన్నారు. 35 బేసిస్‌‌‌‌‌‌‌‌ పాయింట్లు పెంపు తప్పకపోవచ్చన్న ఆమె, 6.25శాతానికి రెపో రేటు చేరుకోవచ్చని చెప్పారు. ప్రస్తుతం రెపో రేటు 5.9 శాతంగా ఉంది. మరికొంత మంది ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్టులు కూడా ఈసారి రెపో రేటును 25–35 బేసిస్ పాయింట్లు పెంచుతారని అంచనావేస్తున్నారు. కాగా, దేశంలో ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌ లెవెల్‌‌‌‌‌‌‌‌  అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొద్దిగా తగ్గినా, ఇంకా ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ పెట్టుకున్న అప్పర్ లిమిట్ 6 శాతానికిపైనే ఉంది.