అంధుల కోసం ఆర్‌‌బీఐ ప్రత్యేక యాప్‌‌

అంధుల కోసం ఆర్‌‌బీఐ ప్రత్యేక యాప్‌‌

న్యూఢిల్లీ: కరెన్సీ నోట్లను అంధులు సులువుగా గుర్తించేందుకు సాయపడే మొబైల్‌‌ అప్లికేషన్‌‌ తయారు చేయాలని ఆర్‌‌బీఐ ప్రతిపాదించింది. ప్రస్తుతం రూపాయి, 10,20,50,100,200,500,2,000 నోట్లు చెలామణిలో ఉన్నాయి. 100 అంతకంటే ఎక్కువ విలువైన నోట్లను అంధులు గుర్తించేందుకు వీలుగా ప్రత్యేక గుర్తులను ముద్రిస్తున్నారు. ఈ మొబైల్‌‌ యాప్‌‌ తయారు చేసేందుకు ఆర్‌‌బీఐ టెక్నాలజీ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. పాత, కొత్త నోట్లపై ఉన్న మహాత్ముడి బొమ్మల ఆధారంగా నోట్ల విలువను చెప్పేలా యాప్‌‌ను రూపొందించాలని కోరింది. కేవలం రెండు సెకన్లలో ఇది నోటు విలువ ఎంతో చెప్పేలా తయారు చేస్తామని తెలిపింది.