RBI: డిజిటల్ పేమెంట్స్ విషయంలో ఆర్బీఐ స్టేట్మెంట్

RBI: డిజిటల్ పేమెంట్స్ విషయంలో ఆర్బీఐ స్టేట్మెంట్

దేశంలో డిజిటల్ చెల్లింపులు సెప్టెంబర్ 2022 వరకు24.13 శాతం పెరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల అడాప్షన్ కోసం ఆర్బీఐ ప్రత్యేకంగా ఒక ఇండెక్స్ ను తీసుకొచ్చింది. ఈ ఇండెక్స్ సెప్టెంబర్ 2022 నాటికి 377.46 కి చేరినట్లు ఆర్బీఐ పేర్కొంది. మార్చి 2022 చివర్లో ఈ ఇండెక్స్ 349.30 వద్ద నిలిచినట్లు ఆర్బీఐ వివరించింది. పేమెంట్ ఎనేల్లర్స్, పేమెంట్ ఇన్ఫ్రాస్టక్చర్, పేమెంట్ పర్ఫార్మెన్స్, కన్జూ మర్ సెంట్రిసిటీ అనే అంశాల ఆధారంగా ఈ ఇండెక్స్ ను రూపొందించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.