మొదటి పైలెట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌ను లాంచ్ చేయనున్న ఆర్​బీఐ

మొదటి పైలెట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌ను లాంచ్ చేయనున్న ఆర్​బీఐ

మొదటి పైలెట్ ప్రాజెక్ట్

న్యూఢిల్లీ: డిజిటల్ రూపాయి మొదటి పైలెట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌ను ఆర్​బీఐ మంగళవారం  లాంచ్‌‌ చేయనుంది. ఎస్‌‌బీఐ, హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్‌‌, ఐసీఐసీఐ బ్యాంక్‌‌లతో సహా తొమ్మిది బ్యాంక్‌‌లు ప్రభుత్వ సెక్యూరిటీస్‌‌ (బాండ్‌‌) మార్కెట్‌‌ ట్రాన్సాక్షన్ల కోసం  వర్చువల్ కరెన్సీని ఇష్యూ చేస్తాయి. హోల్‌‌సేల్ సెగ్మెంట్‌‌లో మొదటి డిజిటల్ రూపాయి పైలెట్ ప్రాజెక్ట్‌‌ ఇదేనని  ఆర్‌‌‌‌బీఐ పేర్కొంది.  

రిటైల్ సెగ్మెంట్‌‌లో  డిజిటల్ రూపాయి పైలెట్ ప్రాజెక్ట్‌‌ను ఇంకో నెలరోజుల్లో కొన్ని ప్రాంతాల్లో లాంచ్ చేస్తామని వివరించింది.  కస్టమర్లు, మర్చంట్లతో కూడిన ఓ క్లోజ్డ్ గ్రూప్‌‌కు ఈ పైలెట్ ప్రాజెక్ట్‌‌లో భాగంగా డిజిటల్ కరెన్సీ అందుబాటులో ఉంటుంది.  ఇతర హోల్‌‌సేల్ ట్రాన్సాక్షన్లు, క్రాస్ బోర్డర్ పేమెంట్ల కోసం కూడా పైలెట్ ప్రాజెక్ట్‌‌లను లాంచ్ చేస్తారు.