కేంద్రానికి ఆర్బీఐ రూ. 87,416 కోట్ల డివిడెండ్

కేంద్రానికి ఆర్బీఐ రూ. 87,416 కోట్ల డివిడెండ్

న్యూఢిల్లీ: 2022–23 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వానికి రూ. 87,416 కోట్ల డివిడెండ్ చెల్లించాలన్న ప్రపోజల్​ను రిజర్వ్ బ్యాంక్ ఆమోదించింది. అంతకుముందు సంవత్సరంలో చెల్లించిన దాని కంటే ఇది దాదాపు మూడు రెట్లు ఎక్కువ. 2021–-22 అకౌంటింగ్ సంవత్సరానికి డివిడెండ్​గా రూ.30,307 కోట్లు చెల్లించింది.

సంస్థ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన జరిగిన రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 602వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రూ.87,416 కోట్ల మిగులును కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి బోర్డు ఆమోదించిందని, అయితే కంటింజెన్సీ రిస్క్ బఫర్‌‌ను 6 శాతంగా ఉంచాలని నిర్ణయించిందని ఆర్‌‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. గ్లోబల్‌‌ ఆర్థిక, రాజకీయ  పరిస్థితులపై కూడా బోర్డు చర్చించింది.