కార్డు టోకెనైజేషన్‌తో మోసాలను అరికట్టొచ్చు

కార్డు టోకెనైజేషన్‌తో మోసాలను అరికట్టొచ్చు


బిజినెస్ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రెడిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డెబిట్ కార్డు మోసాలను అరికట్టేందుకు ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ తీసుకొస్తున్న ‘కార్డు టోకెనైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ వచ్చే నెల 1 నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటికే అమెజాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫ్లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్ట్ వంటి షాపింగ్ సైట్లలో, ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పే, గూగుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పే వంటి పేమెంట్ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైట్లలో కస్టమర్లు సేవ్ చేసుకున్న కార్డు డిటెయిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిలీట్ అయిపోతాయి. కస్టమర్లు తమ కార్డు డిటెయిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను టోకెనైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి  మర్చంట్ సైట్లలో సేవ్ చేసుకోవాలి. కార్డు టోకెనైజేషన్ అంటే డెబిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, క్రెడిట్ కార్డులకు చెందిన  ముఖ్యమైన డిటెయిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బదులు ‘టోకెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ క్రియేట్ అవుతుంది. కస్టమర్లు తమ కార్డు డిటెయిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మర్చంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైట్లకు ఇవ్వకుండానే  పేమెంట్లు జరుపుకోవడానికి ఈ టోకెన్లతో వీలుంటుంది. కార్డును టోకెనైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవడం తప్పనిసరి కాదు. కానీ, టోకెనైజేషన్ చేసుకోకపోతే  పేమెంట్ చేసేటప్పుడు ప్రతీసారి కార్డు డిటెయిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, సీవీవీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు  అమెజాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కస్టమర్ షాపింగ్ చేశాడని అనుకుందాం.  పేమెంట్ చేసేటప్పుడు మొదట కార్డు డిటెయిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  ఎంటర్ చేసి, ఆ డిటెయిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను టోకెనైజ్ చేయడానికి అనుమతి ఇవ్వాలి. టోకెనైజ్ చేయడానికి అనుమతి ఇస్తే కస్టమర్ కార్డు డిటెయిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోకెన్  రూపంలో సేవ్ అయి ఉంటాయి. కేవలం కార్డులోని చివరి నాలుగు నెంబర్లు మాత్రమే టోకెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తాయి. మిగిలిన నెంబర్లు కార్డుకు చెందిన నెంబర్లకు పోలి ఉండవు. ఈ టోకెన్ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కస్టమర్ల కార్డు డిటెయిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టోకెన్ రిక్వెస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిటెయిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (టోకెనైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం కస్టమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిక్వెస్ట్ పెట్టుకున్న సైట్..అంటే ఇక్కడ అమెజాన్ అనుకోవచ్చు. అమెజాన్ వీసా, మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రూపే వంటి కార్డు నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్ కంపెనీలకు కార్డు టోకెనైజేషన్ రిక్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పంపుతుంది), డివైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిటెయిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  కార్డు నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీలు యునిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోకెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను క్రియేట్ చేస్తాయి. ఒరిజినల్ కార్డు డిటెయిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బదులు ఈ టోకెన్ మర్చంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైట్లలో సేవ్ అయి ఉంటాయి.   

కార్డు టోకెనైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి ముఖ్యమైన విషయాలు..

1)ఒక వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్రియేట్ అయిన టోకెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మాత్రమే పనిచేస్తుంది. వేరు వేరు వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్లలో కార్డును సేవ్‌ చేసుకోవాలనుకుంటే వేరు వేరు టోకెన్లను క్రియేట్ చేసుకోవాలి.
2)డెబిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, క్రెడిట్ కార్డులకు రెండు వేరు వేరు టోకెన్లు క్రియేట్ అవుతాయి. 
3)కార్డును టోకెనైజ్ చేసుకోవడానికి ఎటువంటి ఛార్జీలు ఉండవు. టోకెనైజ్ చేసుకోవడం తప్పనిసరి కూడా కాదు. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్లకు కార్డు టోకెన్లు పనిచేయవు.
4)కేవలం ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ ట్రాన్సాక్షన్ల కోసం మాత్రమే కార్డులను  టోకెనైజ్ చేసుకోవడానికి వీలుంటుంది. 
5)ఎన్ని కార్డుల కోసమైనా టోకెనైజేషన్ రిక్వెస్ట్ పెట్టొచ్చు. కార్డులోని చివరి 4  నెంబర్లు బట్టి  ఆయా కార్డు టోకెన్లను గుర్తించొచ్చు. కార్డు అప్‌గ్రేడ్ చేసుకుంటే కొత్త టోకెన్ క్రియేట్ చేసుకోవాలి.

ఎలా టోకెనైజేషన్ చేసుకోవాలంటే..

మొదట మీకు నచ్చిన యాప్ లేదా వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లి ఏదైనా కొనుగోలు చేయడం లేదా బిల్లు పే చేయడం లేదా ఫుడ్‌‌‌‌‌‌‌‌ను ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం వంటివి చేయండి.ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్లేస్ చేసేటప్పుడు  పేమెంట్స్ కోసం మీ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ క్రెడిట్ కార్డు లేదా డెబిట్‌‌‌‌‌‌‌‌కార్డును ఎంచుకోండి. సీవీవీ డిటెయిల్స్‌‌‌‌‌‌‌‌ను నింపండి.
‘మీ కార్డును సెక్యూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోండి’ లేదా ‘కార్డును ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్ ప్రకారం సేవ్‌‌‌‌‌‌‌‌ చేసుకోండి’ అంటూ ఉండే చెక్‌‌‌‌‌‌‌‌ బాక్స్‌‌‌‌‌‌‌‌లో టిక్ చేయండి.రిజిస్టర్డ్ మొబైల్‌‌‌‌‌‌‌‌ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేయండి. మీ కార్డు డిటెయిల్స్‌‌‌‌‌‌‌‌ సెక్యూర్ అయినట్టే. కార్డు టోకెనైజేషన్ పూర్తయినట్టే.