పవర్ఫుల్ టైటిల్తో ‘ఆర్సీ–15’

పవర్ఫుల్ టైటిల్తో ‘ఆర్సీ–15’

హైదరాబాద్: ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌తో కలసి త్వరలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు రామ్‌చరణ్. మార్చి 25న ఈ సినిమా విడుదల కానుంది. ఆ తర్వాత నెల రోజుల గ్యాప్‌‌‌‌తో ‘ఆచార్య’ వచ్చేస్తోంది. ఈ రెండూ కాక శంకర్ దర్శకత్వంలో మరో భారీ ప్రాజెక్ట్‌‌‌‌లో నటిస్తున్నాడు. చరణ్‌‌‌‌కి ఇది 15వ సినిమా. నిర్మాతగా దిల్‌‌‌‌రాజుకి 50వ చిత్రం. ‘వినయ విధేయ రామ’ తర్వాత మరోసారి చరణ్‌‌‌‌కి జంటగా కియారా అద్వానీ నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. జయరామ్, సునీల్, నవీన్‌‌‌‌ చంద్ర ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌‌‌‌ పూర్తయ్యాయి. హైదరాబాద్, రాజమండ్రి చుట్టుపక్కల షూటింగ్ చేశారు. ఈ మూవీకి ‘సర్కారోడు’ అనే టైటిల్‌‌‌‌ను పరిశీలిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

రాజకీయాల్లోని అవినీతిపై పోరాడటానికి ఒక పోలీసాఫీసర్ ఏం చేశాడనేదే మెయిన్‌‌‌‌ కాన్సెప్ట్ కావడంతో ఈ టైటిల్‌‌‌‌ యాప్ట్‌‌‌‌ అవుతుందని అనుకుంటున్నారట. గతంలో ‘విశ్వంభర’ అనే టైటిల్‌‌‌‌ను పరిశీలించినా, మాస్‌‌‌‌ ఆడియెన్స్‌‌‌‌ను దృష్టిలో ఉంచుకుని టైటిల్‌‌‌‌ని మారుస్తున్నట్లు తెలిసింది. అయితే ఇదే సౌండింగ్‌‌‌‌తో అల్లు అర్జున్ ‘సరైనోడు’ సినిమా వచ్చింది. ప్రస్తుతం మహేష్‌‌‌‌ హీరోగా ‘సర్కారు వారి పాట’ రూపొందుతోంది. మరో స్టార్‌‌‌‌‌‌‌‌ హీరో సినిమాలను గుర్తు చేసే టైటిల్‌‌‌‌ను చరణ్‌‌‌‌ సినిమాకి ఫిక్స్ చేస్తారా అనే అనుమానాలూ లేకపోలేదు. చరణ్ బర్త్ డే రోజు టైటిల్‌‌‌‌ని అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది కాబట్టి.. క్లారిటీ కోసం ఆ రోజు వరకు వెయిట్ చేయాల్సిందే.