తెలంగాణ ఖజానాకు‘రియల్’ బొనాంజా

తెలంగాణ ఖజానాకు‘రియల్’ బొనాంజా

తెలంగాణ ఉద్యమ కాలంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్​లో మాంద్యం కనిపించింది. అది దీర్ఘకాలంపాటు ఉంది. మాంద్యం తర్వాత గత కొన్నేళ్లుగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంది. గత కొన్నేళ్లలో రియల్ వ్యాపారం రెండింతలైనట్లు మార్కెట్ రికార్డులు చెబుతున్నాయి. అమెజాన్, ఆపిల్ లాంటి సంస్థలు మన నగరానికి వచ్చాయి. ఆస్తుల క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. ఆఫీస్ స్పేస్ కు ఏటా 40 లక్షల స్క్వైర్ ఫీట్ (ఎస్ఎఫ్టీ) నుంచి 45 లక్షల ఎస్ఎఫ్టీల మేర డిమాండ్ పెరుగుతోంది. హైదరాబాద్ వ్యాపార భవనాల లీజింగ్ 90 లక్షల స్క్వైర్ ఫీట్లకు పెరిగింది. బెంగళూరులో ఇది దాదాపు 1.30 కోట్ల ఎస్ఎఫ్టీలు ఉంది.

బెంగళూరు తర్వాతి స్థానంలో హైదరాబాద్ ఉంది. దీంతో నగరానికి వస్తున్న ఉద్యోగుల సంఖ్యకు తగ్గట్లు ఇళ్ల నిర్మాణాలు, రిటైల్ ఔట్ లెట్లు కూడా పెరిగాయి. దీంతో ప్రాపర్టీ రేట్లు 10 శాతం నుంచి 15 శాతం పెరిగాయి. ఏటా పెరుగుతూనే ఉన్నాయి. రెండేళ్లలో కొన్ని ప్రాంతాల్లో భూముల రేట్లు వందశాతం పెరిగాయి.స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్, ప్రాపర్టీ ట్యాక్స్, ఇతర ట్యాక్సుల రూపంలో ఈ రంగం నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం అందుతోంది. దీంతో ప్రభుత్వం మౌలిక వసతులు, ఇతర సదుపాయాలపై పెట్టుబడులు పెట్టగలుగుతోంది. ఇతర రాష్ట్రాల బిల్డర్లు హైదరాబాద్ ను తమ ప్రయారిటీ మార్కెట్ గా మార్చుకున్నారు. ఇతర మెట్రోలతో పోలిస్తే గవర్నమెంట్ పాలసీలు, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ఎఫార్డబులిటీలో హైదరాబాద్ బెస్ట్ అంటున్నారు.