
పారిస్ : పారిస్ ఒలింపిక్స్‌ను వీక్షించేందుకు ఫ్యాన్స్ కూడా పోటెత్తనున్నారు. ఇప్పటి వరకు 10 మిలియన్ టిక్కెట్లను అందుబాటులోకి తీసుకురాగా, 9.7 మిలియన్ అమ్ముడుపోయాయని నిర్వాహకులు తెలిపారు. ఈవెంట్ చరిత్రలో ఇదే అత్యధికమని చెప్పారు. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో 8.7 మిలియన్ టిక్కెట్ల రికార్డు బ్రేక్ అయ్యిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఒలింపిక్స్‌కు ప్రజాదరణ మరింత పెరిగిందని
పరిస్థితులు ఎలా ఉన్నా అపూర్వమైన స్వాగతం లభిస్తోందని నిర్వాహకులు పేర్కొన్నారు. అయితే కొన్ని క్రీడాంశాల్లో ఇంకా టిక్కెట్లు మిగిలి ఉన్నాయి. ఏప్రిల్‌లో టిక్కెట్ల అమ్మకం మొదలుపెట్టగా, అధిక ధరలు ఉన్నాయని విమర్శలు వచ్చాయి. దీంతో స్థానిక యువత, ఔత్సాహిక క్రీడాకారులు, వికలాంగులు, ఇతరులకు మిలియన్ టిక్కెట్లను ఉచితంగా అందించారు.