
ఏదైనా విషయాన్ని చాలా చిన్నది అని చెప్పడానికి చీమలతో పోలుస్తాం. అంటే చీమతో అన్నమాట. చీమ అంటేనే చిన్నది అన్న భావన కూడా కలుగుతుంది. అయితే చీమలను తక్కువ చేసి చూడొద్దని, వాటి ప్రత్యేకత వాటిదేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చిన్నవే అయినా కొన్ని రకాల చీమలు కుడితే లబోదిబోమనాల్సిందేనని గుర్తు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పుడు వాతావరణంలో కలిగిన మార్పుల వలన ఎర్ర అగ్ని చీమలు బ్రిటన్ పై దాడి చేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఎర్రచీమలు ప్రపంచంలో అత్యంత డేంజరస్, దూకుడుతో ఉంటాయి. ఇవి ఇప్పుడు బ్రిటన్ ప్రజలను ముప్పుతిప్పలు పెట్టే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పుడు అవి ఆ దేశంపై దాడి చేసి కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పుడువాతావరణంలో సంభవించిన మార్పులతోఎర్ర చీమలు బ్రిటన్ కు వలస వెళుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇటాలియన్ ద్వీపం సిసిలీలోని సిరక్యూస్ సిటీ సమీపంలో ఐదు హెక్టార్లలో విస్తరించి ఉన్న 88 ఎర్ర చీమల గూళ్లను గుర్తించారు. ఇప్పుడు అవి లండన్‌తో సహా ప్రధాన నగరాలోకి ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
యూరప్‌లోని పట్టణ ప్రాంతాల్లోని సగ భాగన్ని ఎర్ర చీమలు ఆక్రమించవచ్చని స్పెయిన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎవల్యూషనరీ బయాలజీకి చెందిన స్టడీ లీడర్ రోజర్ విల్లా తెలిపారు. బార్సిలోనా, రోమ్, లండన్ లేదా ప్యారిస్ వంటి పెద్ద నగరాల్లోని ప్రజలు ఎర్రని అగ్ని చీమల ఇబ్బందులు పడతారని చెబుతున్నారు. వాతావరణంలో కలిగే మార్పులను పరిశీలిస్తే ఐరోపాలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించే అవకాశం ఉందని బ్రిటన్ అధికారులు తెలిపారు.
అత్యంత ప్రమాదకరమైన ఎర్ర చీమలు వ్యాపించకముందూ నివారణ చర్యలు చేపట్టాలని రోజర్ విల్లా అన్నారు. ఈ చీమల గూళ్లను గుర్తించి ధ్వంసం చేయాలన్నారు. అయితే ఈ చీమలు చైనా, అమెరికా దేశాల నుంచి సిసిలీకి వలస వచ్చి ఉండవచ్చని తెలిపారు. ఈ చీమలు కుట్టినట్లయితే ప్రాణాంతక అనాఫిలాక్టిక్ షాక్‌ను ప్రేరేపిస్తాయన్నారు. ఇంకా చాలా చిరాకుతో పాటు దద్దుర్లు, అలెర్జీ కూడా కారణం అవుతుందన్నారు. అయితే దక్షిణ అమెరికాలో ఎర్రని అగ్ని చీమలు పర్యావరణం, వ్యవసాయం, ప్రజల ఆరోగ్యంపై ప్రభావితం చూపుతాయని రోజర్ విల్లా అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇళ్లలో చాలా ఇబ్బంది ...నష్టాన్ని కలిగిస్తాయి చీమలు. చీమల బెడద సాధారణంగా భారీగా జరుగుతుంది. చీమల ముట్టడి నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాదు. చీమలు ఏ కారణం చేతనైనా మీ ఇంటిని ఆక్రమిస్తే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకుండా వదిలేస్తే ఇది భరించలేని పరిమాణంలో సమస్యగా మారుతుంది.