కాశ్మీర్ లో 80కి పెరిగిన రెడ్ జోన్లు

కాశ్మీర్ లో 80కి పెరిగిన రెడ్ జోన్లు

శ్రీనగర్: కాశ్మీర్ లో రెడ్ జోన్ల సంఖ్య 80కి పెరిగాయని అధికారులు శుక్రవారం చెప్పారు. ఈ ప్రాంతాల్లో 42 రోజులపాటు లాక్ డౌన్ రూల్స్ స్ట్రిక్ట్ గా అమలులో ఉంటాయన్నారు. కొత్త కేసులు నమోదైతే లాక్ డౌన్ గడువు పొడిగిస్తామని తెలిపారు. రెడ్ జోన్లలో త్వరలో ర్యాపిడ్ టెస్టింగ్ చేపడతామన్నారు. కరోనా పాజిటివ్ కేసు బయటపడటంతో ప్రధాని మోడీ ప్రకటనకు రెండ్రోజుల ముందే జమ్ముూకాశ్మీర్ లో లాక్ డౌన్ విధించారు. సెక్యూరిటీ బలగాలు మెయిన్ రోడ్లను సీల్ చేశాయి. పాస్ లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్ పోర్టు పూర్తిగా నిలిపివేశామని, నిత్యావసర సరకుల రవాణాకు మాత్రమే అనుమతి ఉందని అధికారులు చెప్పారు. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్ లో 314 కేసులు నమోదు కాగా నలుగురు చనిపోయారు. 38 మంది కోలుకున్నారు. 58 వేల మంది క్వారంటైన్ లో ఉన్నారు.