టీఆర్ఎస్లో చేరిన రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు

టీఆర్ఎస్లో చేరిన రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు

కాంగ్రెస్ పార్టీకి మరోషాక్ తగిలింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు టీఆర్ఎస్ లో చేరారు. యూత్ కాంగ్రెస్ కొడంగల్ నియోజకవర్గ అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్  గులాబీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో  రెడ్డి శ్రీనివాస్ కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. అతనికి పార్టీ కండువా కప్పిన కేటీఆర్  పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 

కాంగ్రెస్ నుంచి వలసలు..

రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక కాంగ్రెస్లో విభేదాలు రచ్చకెక్కాయి.  రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ పాడి కౌశిక్ రెడ్డి కారెక్కారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి తీరుపై సీనియర్లు వీలు దొరికినప్పుడల్లా విమర్శనస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అయితే రేవంత్ రెడ్డిపై బాహంటంగానే విమర్శలు గుప్పించారు. ఇక కాంగ్రెస్లో బలమైన నేతగా పేరుగాంచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి..బీజేపీలో చేరారు.  ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ లీడర్ మర్రి శశిధర్ రెడ్డి రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ..కాంగ్రెస్కు గుడ్ బై చెప్పారు. బీజేపీలో చేరారు.  తాజాగా ప్రధాన రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఆ కాంగ్రెస్ కు రాజీనామా చేయడం ఆ పార్టీకి ఎదురుదెబ్బ కానుంది.