తగ్గు ముఖం పట్టిన బంగారం, వెండి ధరలు

తగ్గు ముఖం పట్టిన బంగారం, వెండి ధరలు

బంగారం,వెండీ ధరలు తగ్గుముఖం పట్టాయి.  గురువారం పెరిగిన గోల్డ్ రేటు శుక్రవారం రూ.160 తగ్గింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర  రూ.32,600 గా ఉంది. ఇక కేజీ సిల్వర్ పై రూ. 645 తగ్గి రూ.37,625 గా ఉంది.

లేటెస్గ్ గా తగ్గిన రేటుతో  హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 33,330, 22 క్యారెట్ల బంగారం ధర 30, 580లకు తగ్గింది. కేజీ సిల్వర్ ధర రూ.39,700 ఉంది. గ్లోబల్ మార్కెట్‌లో కూడా బంగారం ధర ఔన్స్‌కు 0.04 శాతం తగ్గడంతో  1,285.65 డాలర్లకు తగ్గింది. వెండి ధర ఔన్స్‌కు 0.50 శాతం తగ్గి 14.46 డాలర్లకు పడిపోయింది.