పద్మారావునగర్, వెలుగు: సోషల్ మీడియా రీల్స్ సరదా ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. రైల్వే ట్రాక్‌పై రీల్స్ చేస్తూ ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ఓ హోటల్ కార్మికుడు దుర్మరణం చెందిన విషాద ఘటన నేరెడ్మెట్ సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన సుభాష్ మాలిక్ (30) సఫిల్‌గూడలోని ఓ హోటల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
మంగళవారం సాయంత్రం స్నేహితులతో కలిసి సరదాగా రీల్స్ చేసేందుకు నేరెడ్మెట్ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లాడు. రీల్స్ తీసే క్రమంలో వేగంగా వచ్చిన ఎంఎంటీఎస్ రైలు సుభాష్మాలిక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
