డొల్ల కంపెనీలపై సీసీఎస్‌లో ఫిర్యాదు

డొల్ల కంపెనీలపై సీసీఎస్‌లో ఫిర్యాదు

పలు డొల్ల కంపెనీల పై హైదరాబాద్ సిసిఎస్ లో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఫిర్యాదు చేశారు. 13 డొల్ల కంపెనీలపై ఫిర్యాదు చేశారు అధికారులు. నకిలీ ధ్రువపత్రాలు, ఫోర్జరీ సంతకాలతో బోగస్ కంపెనీలు నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆన్లైన్ గేమ్స్, పెట్టుబడుల ఆప్స్ పేరుతో రెండు వేల కోట్లను డొల్ల కంపెనీల ద్వారా హాంకాంగ్ తరలించినట్లు సిసిఎస్ పోలీసులు అనుమానిస్తున్నారు. మాల్ 008, మాల్ 98, వైఎస్012,3 మాల్ రిబేట్.కామ్  పేరుతో అమాయకులను చైనీయులు మోసం చేసినట్లు గుర్తించారు. పెట్టుబడి పేరుతో డబ్బులు వసూలు చేసి  మోసాలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.