వీడియో: వర్షంలోనే త్రివిధ దళాల రిహార్సల్స్

వీడియో: వర్షంలోనే త్రివిధ దళాల రిహార్సల్స్

ప్రతి యేడు ఆగష్టు 15న ఇండిపెండెన్స్ డే రోజు భారత ప్రధాని ఎర్రకోట మీద జెండా ఎగురవేస్తారు. అందుకోసం రెండు రోజుల ముందుగానే త్రివిధ దళాలు రిహార్సల్స్ చేస్తాయి. ఈ సంవత్సరం కూడా రిహార్సల్స్ సాగుతున్నాయి. ఇందులో కొత్తేం లేదు. కాకపోతే.. ఢిల్లీలో కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఇండిపెండెన్స్ డేకు రెండు రోజుల సమయం మాత్రమే ఉండటంతో.. త్రివిధ దళాలు వర్షంలోనే రిహార్సల్స్ చేస్తున్నాయి. భద్రతా బలగాలు కూడా గొడుగులు, రెయిన్ కోట్లతో ఎర్రకోట చుట్టూ పహారా కాస్తున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులు, పార్టిసిపెంట్స్ కూడా రెయిన్ కోట్లు వేసుకొని హాజరయ్యారు. వర్షాన్ని లెక్కచేయకుండా త్రివిధ దళాలు గౌరవ వందన కార్యక్రమం పూర్తి చేశాయి. కరోనా నేపథ్యంలో.. కార్యక్రమానికి వచ్చేవారందరూ సామాజిక దూరాన్ని పాటించేలా ఏర్పాట్లు చేశారు. ఆగష్టు 15న ఎర్రకోటపై ప్రధాని మోడి జాతీయ జెండాను ఎగురవేసి.. జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రెడ్ ఫోర్ట్, జామా మసీద్, చాందిని చౌక్, ఓల్డ్ ఢిల్లీ తదితర ఏరియాలను భద్రతా బలగాలు ఇప్పటికే తమ కంట్రోల్ లోకి తీసుకున్నాయి.

For More News..

టీఆర్ఎస్ కు చెందిన మరో నేతకు కరోనా

దగ్గుబాటి అభిరామ్ కు కారు ప్రమాదంతో సంబంధం లేదు

నిన్న ఒక్కరోజే దేశంలో 67 వేల కరోనా కేసులు నమోదు