కోల్‌కతా: సందేశ్ ఖాలీ గ్యాంగ్ రేప్ బాధితురాలు, బీజేపీ అభ్యర్థిని రేఖా పాత్రా ఉప ఎన్నికలో ఘన విజయం సాధించారు. హింగల్ గంజ్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగిన రేఖా పాత్రాకు మొత్తం1,00,207 ఓట్లు రాగా, ఆమె ప్రత్యర్థి, టీఎంసీ అభ్యర్థి ఆనంద సర్కార్‌కు 94,786 ఓట్లు వచ్చాయి. దీంతో ఆమె 5,421 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బసిర్‌హత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రేఖా పాత్రా ఓటమి పాలయ్యారు.
అయినప్పటికీ, ఆమె పోరాట పటిమపై నమ్మకంతో బీజేపీ అధిష్టానం మరోసారి అవకాశం కల్పిస్తూ హింగల్‌గంజ్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దించింది. ఈ సారి ఆమె పార్టీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా విజేతగా నిలిచారు. సందేశ్ ఖాలీకి చెందిన సామాన్య గృహిణి రేఖా పాత్రా. కాగా, సందేశ్ ఖాలీ గ్యాంగ్ రేప్ కేసులో టీఎంసీ నేత షాజహాన్ షేక్, అతడి అనుచరులు అరెస్ట్ అయ్యారు.
