జెస్ట్‌‌‌‌‌‌‌‌మనీని కొననున్న ఫోన్‌‌‌‌పే!

జెస్ట్‌‌‌‌‌‌‌‌మనీని కొననున్న ఫోన్‌‌‌‌పే!

న్యూఢిల్లీ: యూఎస్ కంపెనీ వాల్‌‌‌‌మార్ట్‌‌‌‌కు చెందిన ఫోన్‌‌‌‌పే  బై నౌ పే లేటర్ (బీఎన్‌‌‌‌పీఎల్‌‌‌‌) ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ జెస్ట్‌‌‌‌మనీని కొనుగోలు చేయనుందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. వడ్డీ రేట్లు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో లోన్లు ఖరీదుగా మారాయి. కన్జూమర్లు తమ ఖర్చులు తగ్గించుకున్నారు. టెక్ కంపెనీల్లోకి ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లు కూడా రావడం తగ్గిపోయాయి.  ఫలితంగా ఫండ్స్‌‌‌‌ను సేకరించడంలో జెస్ట్‌‌‌‌మనీ ఇబ్బందులు పడుతోంది.  చివరిసారిగా జరిగిన ఫైనాన్షియల్ రౌండ్‌‌‌‌లో ఈ కంపెనీ వాల్యుయేషన్‌‌‌‌  400 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇంత కంటే తక్కువకే ఫోన్‌‌‌‌పే  జెస్ట్‌‌‌‌మనీని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ బీఎన్‌‌‌‌పీఎల్‌‌‌‌ స్టార్టప్ కంపెనీ గత రెండు నెలలుగా బయ్యర్ల కోసం వెతుకుతోంది. కంపెనీకి 2021–22 రూ. 145 కోట్ల రెవెన్యూ రాగా, నష్టం రూ.399 కోట్లకు పెరిగింది. 2020–21 లో రూ.89 కోట్ల రెవెన్యూ రాగా, రూ.126 కోట్ల నష్టం వచ్చింది. పేరెంట్ కంపెనీ ఫ్లిప్‌‌‌‌కార్ట్‌‌‌‌ నుంచి  సపరేట్ అవ్వాలని చూస్తున్న ఫోన్‌‌‌‌పే  12 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ దగ్గర కొత్త ఫండింగ్ రౌండ్‌‌‌‌ను పూర్తి చేయాలని చూస్తోంది.