లక్నో: చిన్న తప్పు చేస్తేనే పెద్ద నేరగాడిలా, దేశ ద్రోహిలా చూసే సమాజం ఇది. ఇక జైలుకు వెళ్లి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పా్ల్సిన అవసరం లేదు. మాట్లాడటం కాదు కదా అతని వైపు చూడటానికి కూడా జనం సంకోచిస్తుంటారు. అలాంటిది ఓ యువతిపై అత్యాచారం కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లి బయటకు వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది..? ఆ కామాంధుడిని చూసి ఛీదరించుకుంటారు జనం. కానీ ఉత్తరప్రదేశ్‌లో మాత్రం అలా జరగలేదు.
ఓ యువతిపై అత్యాచారం చేసి సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన వ్యక్తికి అతడి స్నేహితులు, అభిమానులు గ్రాండ్ వెల్కమ్ పలికారు. దేశానికి ఏదో వరల్డ్ కప్ సాధించి పెట్టిన మాదిరిగా నిందితుడికి పూలమాలు వేసి భుజాలపై ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఏంటో తెలుసుకుందాం..
హిందూ యువ వాహిని ఘజియాబాద్ యూనిట్ చీఫ్ సుశీల్ ప్రజాపతిపై 2025లో అత్యాచార కేసు నమోదైంది. ఎల్‌ఎల్‌బీ చదువుతున్న ఓ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సుశీల్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. గత ఎనిమిది నెలలుగా జైల్లో ఉన్న నిందితుడికి ఇటీవల కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
►ALSO READ | పుష్పా ఝుక్ గయా..? ఫాల్తా రీ పోలింగ్ నుంచి తప్పుకున్న జహంగీర్ ఖాన్‌పై బీజేపీ ట్రోల్స్
జైలు నుంచి బయటకు వచ్చిన సుశీల్‌కు అతడి అభిమానులు, మిత్రులు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి, భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్లారు. అత్యాచార కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడికి పూలమాలలు వేసి భుజాలపై మోసుకుంటా ఘన స్వాగతం పలికి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు, ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అత్యాచార కేసులో జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తికి ఏదో ఉద్ధరించినట్లుగా ఆ స్వాగతం పలకడమేంటని పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఓ యువతి జీవితాన్ని నాశనం చేసిన నిందితుడికి విజయోత్సవ ర్యాలీ నిర్వహించడంపై భగ్గుమంటున్నారు నెటిజన్లు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు.
Who are these guys welcoming an alleged rapist?India Shocking :: Rape Accused grand welcome In a shocking incident from Ghaziabad, a right-wing leader, accused of allegedly raping a law student, has been granted bail after spending around eight months in jail. After his release pic.twitter.com/d7VriO0g0v
— Asif Ansari (@Asifansari9410) May 18, 2026
