ప్రభుత్వం గ్యాస్ రేట్లను కంట్రోల్ చేయడం ఆపాలి

ప్రభుత్వం గ్యాస్ రేట్లను కంట్రోల్ చేయడం ఆపాలి
  • రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌‌‌

న్యూఢిల్లీ: దేశంలో నేచురల్ గ్యాస్ రేట్లు ఈ ఏడాది అక్టోబర్ నుంచి పెరుగుతాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ అంచనా వేస్తోంది. కానీ, ప్రభుత్వం గ్యాస్ రేట్లను కంట్రోల్ చేయడాన్ని ఆపాలని, అప్పుడే గ్లోబల్‌‌‌‌గా ఉన్న గ్యాస్ రేట్లతో లోకల్‌‌‌‌ రేట్లు సమానంగా ఉంటాయని అభిప్రాయపడింది. కేజీ–డీ6 గ్యాస్ రేటు ఒక మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్‌‌‌‌ (ఎంఎంబీటీయూ) రేటు  ప్రస్తుతం 9.92 డాలర్లుగా ఉంది. ఈ రేటు మరింత పెరుగుతుందని రిలయన్స్ భావిస్తోంది. 
గత కొన్ని క్వార్టర్ల నుంచి  రిలయన్స్ గ్యాస్ ఎక్స్‌‌‌‌ప్లోరేషన్ బిజినెస్‌‌‌‌ నష్టాల్లో ఉండగా, గ్లోబల్‌‌‌‌గా గ్యాస్ రేట్లు పెరగడంతో జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో  లాభాల్లోకి  వచ్చింది. కాగా, ఇంటర్నేషనల్‌‌‌‌ రేట్లను బట్టి ప్రతి ఆరు నెలలకు ఒకసారి దేశంలో  గ్యాస్ రేట్లను ప్రభుత్వం సవరిస్తుందన్న విషయం తెలిసిందే. కష్టతరమైన గ్యాస్ ఫీల్డ్​ల నుంచి తీసిన గ్యాస్‌‌‌‌ను ఎంఎంబీటీయూకి 9.92 డాలర్ల చొప్పున అమ్ముకోవడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. అదే సాధారణ గ్యాస్ ఫీల్డ్‌‌‌‌ల నుంచి తీసే గ్యాస్‌‌‌‌ను ఎంఎంబీటీయూకి 6.1 డాలర్ల చొప్పున అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చింది.