న్యూఢిల్లీ: అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్‌కు చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలక్ట్రిక్ కార్లను, బ్యాటరీలను తయారు చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం ఈవీ కంపెనీ బీవైడీ ఇండియా మాజీ ఎగ్జిక్యూటివ్‌ను కన్సల్టెంట్‌గా నియమించుకుందని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. ఏడాదికి 2,50,000 ఎలక్ట్రిక్ కార్ల తయారీ కెపాసిటీ ఉండే ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చవుతుందో తెలియజేయాలని ఆయన్ని కోరింది.
దీనికి సంబంధించి ‘కాస్ట్ ఫీజిబిలిటీ’ స్టడీ జరపనుంది. ఈవీ ప్లాంట్ కెపాసిటీని భవిష్యత్‌లో 7,50,000 బండ్లకు పెంచుకునే ఆలోచనలో కూడా రిలయన్స్ ఇన్‌ఫ్రా ఉందని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. అంతేకాకుండా బ్యాటరీ తయారీ ప్లాంట్‌ను కూడా 10 గిగావాట్ అవర్ కెపాసిటీతో మొదలు పెట్టి రానున్న పదేళ్లలో 75 గిగావాట్ అవర్‌కు పెంచుకోవాలని కూడా కంపెనీ చూస్తోంది. ఇందుకు సంబంధించి కూడా కాస్ట్ ఫీజిబిలిటీ స్టడీని జరపనుంది.