కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్‌లోని రెనీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ‘రెనీ రీప్లేస్‌మెంట్ లైవ్ సర్జరీ సీపీడీ–2026’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెండు రాష్ట్రాల నుంచి 220 మంది ఆర్థోపెడిక్ సర్జన్లు హాజరయ్యారు. చీఫ్ గెస్ట్ ప్రొఫెసర్ రాంకుమార్ రెడ్డి, డాక్టర్ అఖిల్ దాడి, డా.రజిని ప్రియదర్శిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ బంగారి స్వామి మాట్లాడుతూ తెలంగాణలో హైదరాబాద్ మినహా రోబోటిక్ చికిత్స ద్వారా మోకాలు కీలు మార్పిడి విధానం కేవలం రెనీ హాస్పిటల్ లో అందుబాటులోకి తేవడం ఆనందంగా ఉందన్నారు.
దీంతో తక్కువ ఖర్చుతో స్థానికులకు వైద్యం అందుతుందని చెప్పారు. ఆర్థోపెడిక్ డాక్టర్లు ఆర్ముగం, రత్నాకర్ రావు, కృష్ణ కిరణ్, ఆదర్శ అన్నప రెడ్డి, అఖిల సుందర్, కరీంనగర్ ఐఎంఏ అధ్యక్షురాలు ఆకుల శైలజ, తానా కరీంనగర్ కోశాధికారి వంశీధర్ రెడ్డి పాల్గొన్నారు.
