ఇంటి సామాన్లు దాచేందుకు కిరాయికి గోడౌన్లు

ఇంటి సామాన్లు దాచేందుకు కిరాయికి గోడౌన్లు
  • వర్క్ ఫ్రం హోమ్​ ఉద్యోగులకు యూజ్​ఫుల్​
  • సిటీలో అద్దె ఇండ్లు ఖాళీ చేసి సామగ్రి తరలింపు​
  • తక్కువ చార్జీలు ఉండే స్టోరేజ్ ​హోమ్​​లకు షిఫ్ట్​
  • గతేడాది నుంచి 60 శాతం పెరిగిన కస్టమర్లు

“ హరీశ్ ఐటీ ఎంప్లాయ్. సిటీలో ఫ్యామిలీతో అద్దెకు ఉండేవాడు. కరోనా.. లాక్​డౌన్​తో కంపెనీ వర్క్​ ఫ్రం​ హోమ్​ ఇచ్చింది. దీంతో అతడు సొంతూరు వెళ్లిపోయాడు. ఏడాదిన్నరగా అక్కడి నుంచే వర్క్​ చేస్తున్నాడు.   అద్దె ఇంట్లోనే సామాన్లు ఉంచి వెళ్లాడు. ప్రతినెలా కట్టే అద్దె భారంగా మారింది. దీంతో అతడు రెంట్​ తక్కువగా ఉండే స్టోరేజ్ ​గోడౌన్​కు సామాన్లు షిఫ్ట్ ​చేయించాడు.” 

“ప్రశాంత్​ ప్రైవేట్ ​జాబ్​చేస్తూ ఫ్రెండ్స్​తో  కిరాయికి ఉండేవాడు. కరోనా ఎఫెక్ట్​తో  జాబ్ ​పోవడంతో సొంతూరు వెళ్లిపోయాడు.  కొంతకాలానికి పరిస్థితులు మామూలుగా మారితే రావొచ్చనే ఉద్దేశంతో తన సామాన్లు ఇక్కడే ఉంచి వెళ్లాడు. కొద్దినెలల వరకు అద్దె కట్టాడు. ఆర్థిక ఇబ్బందులు రావడంతో ఖర్చు తగ్గించుకునేందుకు తన సామాన్లను స్టోరేజ్​గోడౌన్​కు షిఫ్ట్​ చేశాడు.’’ 

హైదరాబాద్, వెలుగు: గతేడాది కరోనా రాక.. లాక్​ కారణంగా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం, స్టూడెంట్లకు ఆన్​లైన్​ క్లాసులు పెట్టడడంతో చాలామంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. పరిస్థితులు మామూలుగా మారితే మళ్లీ రావొచ్చని అద్దె ఇండ్లలోనే సామాన్లు ఉంచి పోయారు. వాటి కోసమే వేల రూపాయల కిరాయిలు కట్టడడం భారమైన వారికి రెంట్ ఫర్ స్టోరేజ్ కంపెనీలు యూజ్ ఫుల్​గా మారాయి. అద్దెలో సగం కంటే తక్కువ ఖర్చుకే స్టోరేజ్, ఇన్య్సూరెన్స్, పెస్ట్ కంట్రోల్, క్లీనింగ్ వంటి సేవలు అందిస్తున్నాయి. కొవిడ్ కంటే ముందుతో పోలిస్తే స్టోరేజ్ కంపెనీలకు 60 శాతానికి పైగా కస్టమర్లు పెరిగారు. సామాన్లను బట్టి చార్జ్​ చేస్తున్నాయి.

ఇక్కడ ఉన్నా లేకున్నా ..
ఉద్యోగాలు, చదువులకు రాష్ర్టంలోని జిల్లాలు, వివిధ రాష్ట్రాల నుంచి సిటీకి వచ్చి కిరాయి ఇండ్లలో ఉండేవారు లక్షల మంది ఉంటారు. కరోనా.. లాక్​డౌన్​ కొద్ది రోజులే అనుకుని పోయినవారు, సొంతూళ్లకు వెళ్లినవారు రెండేళ్లయినా తిరిగిరాని పరిస్థితి. ఇక్కడ ఉన్నా లేకున్నా ఇంటి అద్దెలు చెల్లించాల్సిందే. చాలా మంది రెంట్​భారం తగ్గించుకునేందుకు ఇండ్లను ఖాళీ చేసి సామాన్లను వేర్ హౌజ్​ల్లో పెట్టుకుంటున్నారు. దీంతో రెంట్ ఫర్ స్టోరేజ్ సర్వీసులకు  డిమాండ్ భారీగా పెరిగింది. గతేడాది ఆగస్ట్ నుంచి కంపెనీలకు రోజుకి వందల్లో ఎంక్వయిరీ కాల్స్, రిక్వెస్ట్ మెసేజ్​లు వస్తున్నాయి. అప్పటివరకు కంపెనీల సామాన్లు, హౌజ్ రెనోవేషన్ జరిగే టైంలో కొద్దిరోజులు సామాన్లు స్టోర్ చేసేందుకు మాత్రమే ఆర్డర్లు వచ్చేవి. కరోనాతో ఇప్పుడు హౌజ్ హోల్డింగ్ సామాన్లను స్టోరేజ్ చేస్తున్నాయి. ఇలాంటివి సిటీలో పదుల సంఖ్యలో ఉన్నాయి. కరోనా కాలంలోనే కస్టమర్లు పెరిగిపోగా ఒక్కో కంపెనీకి 200 నుంచి 2 వేల వరకు ఉన్నారు. ఇందులో ఇతర రాష్ట్రాలకు చెందిన వారే 50 శాతానికి పైగా ఉన్నారు. ప్యాకింగ్, మూవింగ్, స్టోరేజ్ అంతా కంపెనీలే చూసుకుంటాయి. సామాన్లను బట్టి రూ. వెయ్యి నుంచి 15 వేల వరకు రెంటుగా తీసుకుంటాయి. ఇన్సూరెన్స్ తో పాటు పెస్ట్ కంట్రోల్, మంత్లీ రిపోర్ట్స్ కూడా వెబ్ సైట్, ఈ మెయిల్స్ ద్వారా కస్టమర్లకు పంపిస్తాయి. 

ప్యాకింగ్ చేసి గోడౌన్​కు తరలింపు
కస్టమర్ నుంచి ఆర్డర్ వచ్చాక స్టోరేజ్ కంపెనీకి చెందిన నలుగురైదుగురు టీం వారి ఇంటికి వెళ్తుంది. కస్టమర్​ రాలేకపోతే బంధువులు, ఫ్రెండ్స్​ ఎవరైనా కానీ  షిఫ్టింగ్ టైమ్​​లో ఉండాలని చెప్తారు. ఎవరూ లేకపోతే కస్టమర్​కు వీడియో కాల్ చేసి వారు చెప్పిన వస్తువులను ప్యాకింగ్ చేసి గోడౌన్​కు తరలిస్తారు. అక్కడ కస్టమర్​ పేరు రాసి సామాన్లను భద్రపరుస్తారు. సీసీ టీవీ అండర్​ కంట్రోల్​లో ఉంచడమే కాకుండా సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉంటారు. వస్తువులు ఎలాంటి డ్యామేజ్ కాకుండా జాగ్రత్త పడతారు. ఒకవేళ ఏమైనా అయితే ఇన్య్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నారు. నెలకొకసారి పెస్ట్ కంట్రోల్ చేయడం, సామాన్లను ఫొటోలు, వీడియోలు తీసి కస్టమర్లకు పంపుతారు.  

వస్తువును బట్టి చార్జ్
ఇంట్లోని వస్తువును బట్టి చార్జ్ చేస్తారు. పెద్దదైతే రూ. 130, మీడియం సైజ్ లో ఉంటే రూ. 65, చిన్నదైతే రూ. 30 ఇలా నెలకి చార్జ్​చేస్తారు. ఒక 2 బీహెచ్​​కే  ఫ్లాట్​లోని సామాన్లకు నెలకి  రూ. 2,500 నుంచి రూ. 3,500 వరకు  అమౌంట్ అవుతుంది. ఎక్కువ నెలలు స్టోర్ చేసుకునే కస్టమర్లకు డిస్కౌంట్లు కూడా ఉంటాయి. "గతేడా ది ఆగస్ట్ ముందు వరకు కంపెనీ మెటిరియల్, హౌజ్ రెనోవేషన్ పర్పస్​లోనే ఆర్డర్లు వచ్చేవి.  కరోనా.. లాక్ డౌన్ కారణంగా కస్టమర్లు పెరిగిపోయారు. కస్టమర్లు నెల రోజుల నుంచి ఏడాది, ఐదేళ్ల వరకు  సామాన్లు స్టోర్ చేసుకోవచ్చు. టైం లిమిట్ అనేది లేదు. వస్తువులు ఖరీదైనవి అయితే కాస్ట్ లేకుండా ఇన్య్సూరెన్స్ ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నాం. వాళ్లకి నచ్చినప్పుడు వచ్చి చూసుకోవచ్చు. లేదంటే ఫొటోగ్రాఫ్స్, వీడియోలు తీసి పంపిస్తాం." అని స్టోనెస్ట్ స్టోరేజ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జనని తెలిపారు. 

రోజుకి మూడొందల కాల్స్ వరకు
సిటీలో  రెండు చోట్ల స్టోరేజ్ గోడౌన్లు ఉన్నాయి. కస్టమర్ నుంచి రిక్వెస్ట్ వచ్చాక మేమే వెళ్లి సామాన్లు తీసుకొస్తాం. ప్రతినెల కస్టమర్లకు అప్ డేట్ చేస్తాం. రిపోర్ట్స్ కూడా పంపిస్తాం.  డైలీ రెండు, మూడు వందల కాల్స్ వస్తున్నాయి. కరోనా.. లాక్ డౌన్​ తో కస్టమర్లు చాలా పెరిగారు.  వెయ్యి రూపాయల నుంచి మంత్లీ ప్యాకేజీలు ఉంటాయి. గతేడాది నుంచి  చాలా మంది  స్టోర్  చేసుకుంటున్నారు. 
-  రాహుల్, హెడ్ మేనేజర్, స్టోనెస్ట్ స్టోరేజ్ కంపెనీ

అద్దె కట్టడం కష్టమవగా...
 ఏడాదిన్నరగా వర్క్ ఫ్రం హోమ్ ఉన్నా.  ప్రతి నెలా అద్దె కట్టడం కష్టంగా ఉండేది. మా కజిన్ ద్వారా  నాకు  స్టోరేజ్​ కంపెనీ గురించి తెలిసింది. ఎన్ని సామాన్లు ఉన్నాయో లిస్ట్ అవుట్ చేసి నాకు పంపారు. స్టోరేజ్ స్పేస్ కి షిప్ట్ చేశారు. సర్వీస్ చాలా బాగుంది. 
-  దర్శన్ విశ్వనాథ్, కస్టమర్