రేణు దేశాయ్కి హార్ట్ ప్రాబ్లమ్..ఎమోషనల్ పోస్ట్

రేణు దేశాయ్కి హార్ట్ ప్రాబ్లమ్..ఎమోషనల్ పోస్ట్

గత కొంత కాలంగా కొందరు హీరోయిన్లు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇప్పటికే సమంత, మమతా మెహన్ దాస్, బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు.  అయితే లేటెస్ట్ గా రేణు దేశాయ్ కూడా  గుండె, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని తన ఇన్ స్టాగ్రమ్ లో వెల్లడించారు. అయితే ఖచ్చితంగా ఎటువంటి సమస్యతో అనేది మాత్రం చెప్పలేదు.

‘ నేను గుండె , ఇతర  హెల్త్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న. నన్ను దగ్గర నుంచి చూసిన వారందరికీ ఈ విషయం తెలుసు. వాటిని ఎదుర్కొనేందుకు శక్తిని కూడగట్టుకున్న. నాకు ప్రస్తుతానికి ట్రీట్ మెంట్ జరుగుతోంది. మందులు వాడుతున్న. మంచి పోషక ఆహారం తీసుకుంటున్న. త్వరలోనే దీని నుంచి కోలుకుని షూటింగ్ లో పాల్గొనాలని కోరుకుంటున్నా. అయితే ఈ విషయం ఎందుకు చెబుతున్నా అంటే.. నాలాగా ఎవరైనా బాధపడుతుంటే వారిలో ధైర్యాన్ని, పాజిటివ్ ఎనర్జీని నింపేందుకు ఈ పోస్ట్ చేస్తున్న ’ అని రేణు తెలిపారు.