హైదరాబాద్–విజయవాడ హైవేపై బ్లాక్ స్పాట్ల రిపేర్లు

హైదరాబాద్–విజయవాడ హైవేపై బ్లాక్ స్పాట్ల రిపేర్లు
  • రూ.375 కోట్లతో 17 చోట్ల అభివృద్ధి పనులు
  • రేపు శంకుస్థాపన చేయనున్న మంత్రి వెంకట్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్–విజయవాడ నేషనల్ హైవేపై యాక్సిడెంట్స్ ఎక్కువ గా జరుగుతున్న 17 బ్లాక్ స్పాట్ల రిపేర్లకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రూ. 375 కోట్లతో 17 చోట్ల ఫ్లై ఓవర్లు, జంక్షన్ల డెవలప్ మెంట్లు, సర్వీస్ రోడ్లు, అండర్ పాస్ ల నిర్మాణంతోపాటు సైన్ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 23న (ఆదివారం) ఈ పనులకు నార్కట్ పల్లి సమీప చిట్యాల దగ్గర మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. 

ఈ 17 స్పాట్లలో ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయని కేంద్ర ఉపరితల రవాణా శాఖ గుర్తించింది. ఎంపీగా ఉన్నప్పుడు, మంత్రి అయ్యాక కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఈ అంశాన్ని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ పనులకు నిధులు సాంక్షన్ అయ్యాయి. ఏడాదిలోగా ఈ పనులు పూర్తి చేసేలా కాంట్రాక్టర్లకు ప్రభుత్వం గడువు ఇవ్వనుంది.