
అర్జున్‌రెడ్డి(Arjun Reddy) మూవీతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగ(Sandeepreddy Vanga). అదే సినిమాను బాలీవుడ్ లో కబీర్‌సింగ్(Kabir singh) పేరుతో రీమేక్ చేసి మరో వైల్డ్ హిట్ అందుకున్నాడు. అలాంటి డెనిమిక్ డైరెక్టర్ సందీప్ నుండి చాలా గ్యాప్ తరువాత యానిమల్ తో మరో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు. అయితే, ఈ డైరెక్టర్ తీసిన కబీర్ సింగ్ తో చాలా మంది నటీనటులు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
అలా రీసెంట్ గా ‘కబీర్‌సింగ్’ మూవీలో కాలేజీ డీన్ క్యారెక్టర్ చేసిన బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అదిల్ హుస్సేన్‌పై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తాజాగా ఆగ్రహం వ్యక్తంచేశారు. అదిల్ హుస్సేన్ అనే నటుణ్ని కబీర్ సింగ్ మూవీలో తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. ఈమేరకు తన ఎక్స్‌లో పెద్ద పోస్ట్ చేశారు. దాదాపు ఐదేళ్ల క్రితం రిలీజైన ఈ సినిమాలో నటించిన ఒక నటుడిపై డైరెక్టర్ సందీప్ ఎందుకు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తంచేశారనేది వివరంగా తెలుసుకుందాం.
అదిల్ హుస్సేన్ (Adil Hussain) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కబీర్ సింగ్ లో అనవసరంగా నటించానంటూ అసహనం వ్యక్తం చేశాడు. "ఇప్పటివరకూ నా సినీ కెరీర్‌లో ‘ఎందుకు నటించానా?’ అని ఫీలైన ఫస్ట్ మూవీ ఏదైనా ఉందంటే అది కబీర్ సింగ్ మాత్రమే అని అన్నారు. ఈ సినిమాలో కాలేజీ డీన్ పాత్రలో నటించాను.కానీ, సినిమాకి ముందు నేను ఎన్నిసార్లు నో చెప్పినా వినకుండా బ్రతిలాడారు. ఒకేఒక్క రోజు షూట్‌కు రమ్మని అడిగారు. అందుకు పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ని ఆఫర్ చేశారు. దాంతో సెట్ కి వెళ్లి డైరెక్టర్ చెప్పిన సీన్ యాక్ట్ చేసి కామ్ గా వచ్చేశా. కానీ, ఆ సీన్ చాలా ప్రౌడ్ గా అనిపించింది. ఇక సినిమా కూడా మొత్తం అలాగే ఉంటుందని భావించాను.తీరా రిలీజయ్యాక చూస్తే..‘‘ఇలాంటి సినిమాలో నేనెందుకు నటించానా?’’ అని చాలా ఇబ్బందికరంగా ఫీలయ్యా. అంతెందుకు ఫ్రెండ్ తో కలిసి సినిమా చూడ్డానికి థియేటర్ కి వెళ్లిన..కానీ, నేను మధ్యలోనే బయటకు వచ్చేలా చేసింది. ఒకవేళ నా వైఫ్ కనుక మూవీ చూసి ఉంటే తప్పకుండా నన్ను తిట్టేది’’ అని హుస్సేన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఇక తాజాగా ఇదే విషయంపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తనదైన శైలిలో ఇచ్చిపడేసాడు."మీరు గొప్పగా భావించి నటించిన 30 సినిమాలలో రాని గుర్తింపు..ఎందుకు నటించానా? అని ఫీలవుతున్న ఈ ఒక్క బ్లాక్‌బస్టర్ కబీర్ సింగ్ తో వచ్చిన విషయం మరిచిపోకు.మీకు నటనపై అభిరుచి కంటే దురాశ ఎక్కువగా ఉన్న మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు ఇప్పుడు చాలా చింతిస్తున్నాను. ఇకపై మీరంత సిగ్గుపడకుండా..మిమ్మల్ని అవమానం నుండి కాపాడతాను. ఆ సినిమాలో మీ స్థానాన్ని ఏఐ సాయంతో ఫిల్ చేస్తా" అని సందీప్ రెడ్డి ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అదిల్ హుస్సేన్ సినిమాల విషయానికి వస్తే..
ఇష్కియా’, ‘ఏజెంట్ వినోద్’, ‘ఇంగ్లిష్ వింగ్లిష్’, ‘లైఫ్ ఆఫ్ పై’, ‘జడ్ ప్లస్’, ‘ఫోర్స్ 2’, ‘కమాండో 2’, ‘రోబో 2.0’, ‘గుడ్‌న్యూస్’ వంటి మూవీస్ లో నటించాడు.
Ur 'belief' in 30 art films didn't get as much fame to u as ur 'regret' of 1 BLOCKBUSTER film did ?https://t.co/BiJIV3UeyO
— Sandeep Reddy Vanga (@imvangasandeep) April 18, 2024
I regret casting u,knwing that ur greed is bigger than ur passion. NOW I'll save U from the shame by replacing Ur face with AI help? Now smile properly ?