Virat Kohli Retirement: కోహ్లీ రిటైర్మెంట్‌పై కొత్త ట్విస్ట్.. బీసీసీఐ తీసుకొచ్చిన ఆ రూల్ కారణంగానే గుడ్ బై..

Virat Kohli Retirement: కోహ్లీ రిటైర్మెంట్‌పై కొత్త ట్విస్ట్.. బీసీసీఐ తీసుకొచ్చిన ఆ రూల్ కారణంగానే గుడ్ బై..

టీమిండి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ నిర్ణయం ప్రపంచ క్రికెట్ కు ఆశ్చర్యానికి గురి చేసింది. సోమవారం (మే 12) ఇంస్టాగ్రామ్ లో తన రిటైర్మెంట్ అవుతున్నట్టు ప్రకటించి షాక్ ఇచ్చాడు. ఫిట్ నెస్.. ఫామ్.. అనుభవం ఇలా ఏ రకంగా చూసుకున్నా కోహ్లీ టెస్ట్ క్రికెట్ లో కొనసాగడానికి అర్హుడు. విరాట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పడానికి సరైన కారణం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. కోహ్లీ రిటైర్మెంట్ పై రకరకాల వార్తలు వచ్చినా.. ఒక కొత్త పుకారు కోహ్లీ వైరల్ గా మారుతుంది. బీసీసీఐ తీసుకొచ్చిన ఫ్యామిలీ విధానం కోహ్లీకి నచ్చకపోవడం వలనే టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు తెలిపినట్టు సమాచారం.

ALSO READ | WTC Final: స్టార్ ఆల్ రౌండర్ రీ ఎంట్రీ.. టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

కోహ్లీ తన రిటైర్మెంట్ ఆలోచన విధానాన్ని ఏప్రిల్ లోనే చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కు తెలిపినట్టు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. రిపోర్ట్స్ ప్రకారం కోహ్లీ ఫ్యామిలీతో ఎక్కువ సేపు గడపడానికి కుదరదనే కారణంగానే టెస్ట్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పాడట.ఇంగ్లాండ్ సిరీస్ కు కోహ్లీ సెలక్ట్ అయితే ఫ్యామిలీతో సమయమా గడపడం కుదరదు. బోర్డర్ గవాస్కర్ ఘోరంగా ఓడిపోయిన తర్వాత బీసీసీఐ కుటుంబం విషయంలో పరిమితులు విధించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 45 కంటే ఎక్కువ రోజులు జరిగే  టూర్‌‌‌‌లో ఆటగాళ్ల కుటుంబ సభ్యులు 14 రోజులు మాత్రమే వారితో ఉండవచ్చు.

షార్ట్‌‌ టూర్లలో ప్లేయర్ల భార్యాపిల్లాలు లేదా గర్ల్‌‌ఫ్రెండ్స్ ఒక్క వారం మాత్రమే ఉండేలా పరిమితి విధించింది. ఈ విషయంపై ఆర్‌‌సీబీ ఇన్నోవేషన్ ల్యాబ్ సమ్మిట్‌‌లో కోహ్లీ స్పందించాడు. ‘కుటుంబం ఎంత ముఖ్యమో చెప్పడం కష్టం.మైదానంలో ఎంతటి ఒత్తిడి ఎదురైనా తిరిగొచ్చి  కుటుంబంతో గడిపితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆటలో నిరాశకు గురైనప్పుడు మనకు ఇష్టమైన వారు పక్కనే ఉంటే ఆ బాధ నుంచి కోలుకోవచ్చు. నా వరకు గదిలో ఒంటరిగా కూర్చొని బాధపడటం ఇష్టం లేదు. అందరిలానే సాధారణ జీవితాన్ని కొనసాగించాలనుకుంటాను. ఆడటం నా బాధ్యత, కానీ కుటుంబంతో గడిపే సమయం నా నిజమైన ఆనందం.

అందుకే నేనెప్పుడూ కుటుంబంతో గడిపే సమయాన్ని కోల్పోకుండా చూసుకుంటా.  నేనే కాదు ఏ ఆటగాడైనా  కుటుంబం తమతోనే  ఉండాలని అంటాడు. కానీ ఈ విషయం గురించి కొందరు సంబంధం లేని వ్యక్తులు చర్చలు జరపడం చూసి బాధ కలుగుతోంది’ అని విరాట్ పేర్కొన్నాడు. ఇక, తన ఫిట్‌‌నెస్,  తీసుకునే డైట్ విషయంలో తల్లిని ఒప్పించడం ఎంతో కష్టమైందని కోహ్లీ చెప్పాడు.