చెరువుల కబ్జాలపై ఏం చేశారో రిపోర్ట్‌‌‌‌ ఇవ్వండి

చెరువుల కబ్జాలపై ఏం చేశారో రిపోర్ట్‌‌‌‌ ఇవ్వండి

నాగర్​కర్నూల్​, వెలుగు: నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని  చెరువులు, కుంటల కబ్జాలపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని  కలెక్టర్  శర్మన్  ఆదేశించారు.  నేషనల్​ గ్రీన్​ ట్రిబ్యునల్​ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్​ కమిటీతో సోమవారం కలెక్టర్​ చాంబర్​లో మీటింగ్​ నిర్వహించారు.  ఈ సందర్భంగా చెరువులు, కుంటల్లో వెలసిన అక్రమ కట్టడాల తొలగించేందుకు శాఖల వారీగా ఏం చర్యలు తీసుకున్నారో అడిగి తెలుసుకున్నారు.  ఎన్జీటీలో  నమోదైన ఓ. ఏ నెంబర్ 182/2020 కు సంబంధించి.. సౌత్​జోన్​ బెంచ్ ఇచ్చిన ఆదేశాల మేరకు  తీసుకున్న చర్యల పై పూర్తిస్థాయి రిపోర్ట్‌‌‌‌ ఇవ్వాలని ఆదేశించారు. మీటింగ్‌‌‌‌లో అడిషనల్‌‌‌‌ కలెక్టర్ మనూ చౌదరి, ఇరిగేషన్​ సర్కిల్-–2 ఎస్ఈ సత్యనారాయణ రెడ్డి, ఆర్డీవో నాగలక్ష్మి, ఇరిగేషన్ ఈఈ మురళి, మున్సిపల్ కమిషనర్ అన్వేష్‌‌‌‌ పాల్గొన్నారు.

సర్వేలో తలమునకలైన ఆఫీసర్లు

కేసరి సముద్రం, సద్దల్​సాబ్​ కుంట, పుట్నాల కుంట,తుమ్మల చెరువు, గార్ల చెరువు, నాగనూల్​  చెరువుల కబ్జాలపై ఓవైపు ఎన్జీటీ ఆదేశాలతో  ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్​ కమిటీ,  మరో వైపు జాతీయ బీసీ కమిషన్​ సమన్లు, హైకోర్టు కేసులతో ఆఫీసర్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈనెల 26న ఎన్జీటికి సమర్పించాల్సిన  నివేదికను రెడీ చేసేందుకు   కసరత్తు చేస్తున్నారు. సర్వేయర్లను పిలిపించి చెరువులు,
కుంటల ఎఫ్​టీఎల్​, బఫర్​ జోన్ల హద్దులను గుర్తిస్తున్నారు.  కాగా, ఉమ్మడి​ రాష్ట్రంలో  రూపొందించిన చెరువుల నక్షాలు,  విస్తీర్ణం, ఇతర  వివరాలు గల్లంతైనట్లు తెలుస్తోంది.  ఇదిలాఉండగా ల్యాండ్​ మాఫియా  అధికార పార్టీ నేతల ద్వారా ఇప్పటి వరకు జరిగిన కబ్జాలు, కట్టడాల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరించాలని ఆఫీసర్లపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.  కొత్తగా నాగనూలు చెరువు ఎఫ్​టీఎల్​ పరిధిలో వెంచర్​ ఏర్పాటు చేస్తున్నా..  తమకు తెలియదని ఇరు శాఖల ఆఫీసర్లు చెప్పడం గమనార్హం. గతంలో ఇదే స్థలంలో ప్రభుత్వ నిధులతో రోడ్డు నిర్మించి వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు వాటి నామరూపాలు లేకుండా చేసి రాళ్లు పాతేశారు.

ఇవి కూడా చదవండి 

పెట్రోల్ డబ్బాలతో వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన

భద్రాద్రిలో నవమి ఉత్సవాలకు ఏర్పాట్లు

అప్పుడు పబ్‌‌.. ఇప్పుడు వైల్డ్‌‌లైఫ్‌‌ హాస్పిటల్‌‌

కారు యాక్సిడెంట్.. పోలీసులకు బంగారం అప్పగించిన 108 సిబ్బంది