కిమ్‌ ఆరోగ్యంపై వచ్చిన రిపోర్టులు తప్పు: ట్రంప్‌

కిమ్‌ ఆరోగ్యంపై వచ్చిన రిపోర్టులు తప్పు: ట్రంప్‌
  • సీఎన్‌ఎన్‌పై సీరియస్‌
  • పాత డాక్యుంమెంట్లు చూసి ఉంటారన్న ట్రంప్‌

వాషింగ్టన్‌: నార్త్‌ కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ అరోగ్యం గురించి వచ్చిన సమాచారం తప్పు అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. సీఎన్‌ఎన్‌ తప్పుడు సమాచారం ఇచ్చిందని ఆయన సీరియస్‌ అయ్యారు. పాత డాక్యుమెంట్లు ఆధారంగా కిమ్‌ ఆరోగ్యంపై సీఎన్‌ఎన్‌ తప్పుడు నివేదికలు ఇచ్చిందని ఆరోపించారు. గురువారం వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ ఈ కామెంట్స్‌ చేశారు. ఉత్తర కొరియా నుంచి అధికారిక సమాచారం వచ్చిందా అనే అంశంపై ట్రంప్‌ను ప్రశ్నించగా ఆయన సమాధానం చెప్పలేదు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌కు ఆపరేషన్‌ చేశారని, దాని తర్వాత ఆయన పరిస్తితి సీరియస్‌గా ఉందని సీఎన్‌ఎన్‌ ఇటీవల ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ విషయంపై లోకల్‌ న్యూస్‌ వెబ్‌సైట్స్‌ కూడా రాశాయి. ఈ మేరకు కిమ్‌ త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు ట్రంప్‌ గతంలో కూడా చెప్పారు.