ఐపీఎల్‌కు సూర్య కుమార్ యాదవ్ దూరం.. టీ20 వరల్డ్ కప్ ఆడతాడా..?

ఐపీఎల్‌కు సూర్య కుమార్ యాదవ్ దూరం.. టీ20 వరల్డ్ కప్ ఆడతాడా..?

టీమిండియా స్టార్ ప్లేయర్, టీ20 స్పెషలిస్ట్ సూర్య కుమార్ యాదవ్ గాయం ప్రస్తుతం టీమిండియాను కలవరపెడుతుంది. సౌతాఫ్రికాతో గత నెలలో మూడు టీ20 సిరీస్ లో భాగంగా చివరి టీ20 ఆడుతూ సూర్య గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువ కావడంతో ఇబ్బంది పడుతూనే మైదానాన్ని వీడాడు. చీలమండ గాయం నుంచి ఇంకా కోలుకొని సూరీడు.. ఆఫ్ఘనిస్తాన్‌  టీ20 సిరీస్ కు దూరమయ్యాడు. నిన్న ప్రకటించిన 15 మందిలో ఈ ముంబై బ్యాటర్ కు స్థానం దక్కలేదు.

ఇంతవరకు తెలిసిన విషయమే అయినా తాజాగా సూర్య కుమార్ యాదవ్ ఐపీఎల్ కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తన్నాయి. సూర్యకు   హెర్నియా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. రెండు-మూడు రోజుల్లో అతను శస్త్రచికిత్స కోసం జర్మనీలోని మ్యూనిచ్‌కి వెళ్లనున్నాడు. దీంతో ఈ సీజన్ రంజీ ట్రోఫీ మొత్తానికి, అదే విధంగా ఐపీఎల్ లో ప్రారంభ తొలి అర్ధ భాగం మిస్ కానున్నాడు. 

జూన్ 1 నుంచి టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో బీసీసీఐ సూర్య కుమార్ యాదవ్ ను ఐపీఎల్ ఆడించే ప్రయత్నం చేయకపోవచ్చు. అదే జరిగితే ముంబై ఇండియన్స్ కు భారీ షాక్ తగలడం గ్యారంటీ. ఇప్పటికే హార్దిక్ పాండ్య గాయంతో ఐపీఎల్ ఆడేది అనుమానంగా మారింది. ఈ నేపథ్యంలో సూర్య కుమార్ యాదవ్ కూడా లేకపోతే ముంబై బలహీనంగా మారుతుంది. మొత్తానికి టాప్ ఫామ్ లో ఉన్న సూర్య గాయం ఇటు ముంబై ఇండియన్స్ కు, అటు భారత క్రికెట్ జట్టుకు పెద్ద లోటే అని చెప్పుకోవాలి.