గనిలో చిక్కుకున్న రవీందర్‎ను బయటకుతీసిన రెస్క్యూ టీం

గనిలో చిక్కుకున్న రవీందర్‎ను బయటకుతీసిన రెస్క్యూ టీం

పెద్దపల్లి జిల్లా:  సింగరేణి గనిలో నిన్న జరిగిన ప్రమాదంలో శిధిలాల కింద చిక్కుకున్న కాంట్రాక్ట్ వర్కర్ రవీందర్ ను రెస్క్యూ సిబ్బంది క్షేమంగా బయటకు తీశారు. వెంటనే హుటాహుటిన గోదావరిఖని ఏరియా ఆస్పత్రికి తరలించారు. తాను బాగానే ఉన్నానని రవీందర్ తెలిపాడు. 

ప్రమాదంలో గల్లంతైన ఏడుగురిలో ఇవాళ ఉదయం వరకు ముగ్గురిని బయటకు తీయగా.. రవీందర్ ను మధ్యాహ్నం బయటకు తీశారు. ఇంకా మరో ముగ్గురు శిధిలాల కిందనే ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్ ను ముమ్మరం చేశారు. మిగిలిన  వారిలో అసిస్టెంట్ మేనేజర్ చైతన్య తేజ, జెన్కో ట్రైనీ తోట శ్రీకాంత్, సేఫ్టీ ఆఫీసర్ జయరాజ్ ల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.

రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుండగా.. శిధిలాల కింద చిక్కుకున్న వారి కుటుంబాలు అక్కడే ఉండి ఆందోళనతో ఎదురు చూస్తున్నాయి. భార్యా పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులంతా రెస్క్యూ టీమ్ ఆపరేషన్ వివరాలు తెసుకుంటూ క్షణమొక యుగంలా ఎదురు చూస్తున్నారు. గనిలో చిక్కుకున్న కార్మికుల కుటుంబాలు శోకసముద్రంలో తల్లడిల్లుతున్నాయి.