కార్పొరేటర్, కౌన్సిలర్ ఆశావహుల్లో రిజర్వేషన్ టెన్షన్.. .. జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ పోటీ చేసేందుకు మరికొందరు సిద్ధం

కార్పొరేటర్, కౌన్సిలర్  ఆశావహుల్లో రిజర్వేషన్ టెన్షన్..   ..  జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ పోటీ చేసేందుకు మరికొందరు సిద్ధం
  • పొరుగు డివిజన్లపైనా దృష్టి
  • కరీంనగర్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తాజా మాజీల్లో 66 శాతం మంది బీసీలే..
  • ఇతర మున్సిపాలిటీల పాత పాలకవర్గాల్లో మెజార్టీ స్థానాల్లో బీసీల పాగా

కరీంనగర్, వెలుగు: మున్సిపాలిటీల వార్డులు, డివిజన్ల పునర్విభజన జరగడం, ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రదర్శించడం, త్వరలో ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో రిజర్వేషన్లపై కాంగ్రెస్,  బీఆర్ఎస్, బీజేపీ ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. తమ వార్డు, డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిజర్వేషన్ కలిసొస్తుందో లేదోనన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. తాము నివాసముండే వార్డు రిజర్వేషన్ అనుకూలంగా వస్తే  మాత్రమే బరిలో నిలవాలని కొందరు భావిస్తుండగా.. కొందరు సీనియర్లు పొరుగు వార్డుల్లో రిజర్వేషన్ అనుకూలంగా వచ్చినా ఆ వార్డు నుంచి పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

ఓటరు జాబితాలపై ఆశావహుల దృష్టి

ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు హుజూరాబాద్, చొప్పదండి, జమ్మికుంట, ధర్మపురి, కోరుట్ల, జగిత్యాల, మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, రాయికల్, సుల్తానాబాద్, మంథని, పెద్దపల్లి, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో వార్డులు, డివిజన్ల వారీగా అధికారులు ఈ నెల 1, 2  తేదీల్లో ముసాయిదా ఓటరు జాబితాలు ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ  నేపథ్యంలో వివిధ పార్టీల నుంచి కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా పోటీ చేయాలనుకుంటున్న  ఆశావహులు ఆ జాబితాలను పరిశీలిస్తున్నారు. తమకు అనుకూలంగా ఉన్న కుటుంబాలు ఎన్ని.. ప్రతికూలంగా ఉండేవాళ్లెంత మంది అనే లెక్కలు వేసుకుంటున్నారు. 

తమ డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఓట్లు ఇతర డివిజన్లలో ఏమైనా కలిశాయా.. అలాగే ఉన్నాయా అనే వివరాలపై ఆరా తీస్తున్నారు. అంతేగాక సామాజికవర్గాల వారీగా ఏ వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి.. ఆ వార్డు గతంలో ఏ వర్గానికి రిజర్వ్ అయ్యింది.. ఈ సారి రిజర్వేషన్  ఎవరికి కలిసి వస్తుందనే అంచనాకు కూడా వస్తున్నారు. సగం సీట్లు మహిళలకే కేటాయించనుండడంతో తమకు అనుకూలంగా రాకపోతే తమ భార్యలు, తల్లులను నిలబెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నారు. 

బల్దియాల్లో బీసీలదే పైచేయి.. 

ఉమ్మడి జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో తాజా మాజీ పాలకవర్గాల్లో బీసీలే ఎక్కువగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా గెలుపొందారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో 60 మంది తాజా మాజీ కార్పొరేటర్లలో  40 మంది(66 శాతం) మంది బీసీలే ఉన్నారు. వీరిలోనూ 27 మంది మున్నూరుకాపు సామాజికవర్గానికే చెందిన వారే కావడం గమనార్హం. ఇతర మున్సిపాలిటీల పాతపాలకవర్గాల్లో మెజార్టీ స్థానాల్లో బీసీలే పాగా వేశారు.

దీంతో వారే మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. డివిజన్లు, వార్డుల రిజర్వేషన్లతోపాటు మేయర్, చైర్మన్ సీట్లు ఏ వర్గాలకు రిజర్వ్ అవుతాయనేది ఆసక్తికరంగా మారింది. మేయర్, చైర్మన్ పీఠాలపై ఆశలు పెట్టుకున్న లీడర్లు ఇప్పటినుంచే ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జులను ప్రసన్నం చేసుకునేపనిలో పడ్డారు.