జనవరి నెల బ్యాంకుల సెలవుల జాబితా విడుదల

జనవరి నెల బ్యాంకుల సెలవుల జాబితా విడుదల

2023 జనవరి నెలకు సంబంధించి సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. దీని ప్రకారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఈ నెలలో 15 రోజులు మూసివేయబడతాయి. ఈ సెలవుల్లో రెండవ, నాల్గవ శనివారాలు, అలాగే ఆదివారాలు కూడా ఉన్నాయి. అయితే ప్రతి నెలా మొదటి ,మూడవ శనివారం బ్యాంకులు తెరిచే ఉంటాయి. బ్యాంకులు మూసివేసినా  ఆన్‌లైన్, నెట్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. 

బ్యాంకు సెలవుల్లో కొన్ని రాష్ట్రాల్లో  జాతీయ సెలవు దినాలతో పాటు.. దేశవ్యాప్తంగా ఉన్న సెలవుల్లో బ్యాంకులు మూసివేయబడతాయి.  మొత్తంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  సెలవులను మూడు కేటగిరిలుగా విభజించింది. ఇందులో  నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద సెలవు, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్  హాలిడే,  బ్యాంకుల ఖాతాల ముగింపు ప్రకారం ఈ సెలవును ప్రకటించింది. 


జనవరి 2023లో బ్యాంకుల సెలవులు ఎప్పుడంటే..?

జనవరి1: న్యూ ఇయర్ 
జనవరి 2: న్యూ ఇయర్ సెలబ్రేషన్ – ఐజ్వాల్ (ఐజ్వాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి)
జనవరి 3: ఇమోయిను ఇరట్పా – ఇంఫాల్ (ఇంఫాల్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి)
జనవరి 4: గన్- -నాగై – ఇంఫాల్
జనవరి 7: ఆదివారం
జనవరి 12: స్వామి వివేకానంద జయంతి(కోల్కతాలో మూసివేయబడతాయి)
జనవరి 14: రెండో శనివారం
జనవరి 14: ఆదివారం
జనవరి 16: తిరువల్లువర్ డే – చెన్నై (చెన్నైలో బ్యాంకులు మూసివేయబడతాయి)
జనవరి 17: ఉజావర్ తిరునాల్ – చెన్నై (చెన్నైలో బ్యాంకులు మూసివేయబడతాయి)
జనవరి 22: నాల్గవ ఆదివారం
జనవరి 23: నేతాజీ జయంతి( కోల్కతాలో బ్యాంకులు మూసివేయబడతాయి)
జనవరి 26: రిపబ్లిక్ డే
జనవరి 28: నాల్గవ శనివారం
జనవరి 29: ఐదవ ఆదివారం