
దమ్మాయిగూడా మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి. దమ్మాయిగూడ ప్రజల సమస్యలపై శనివారం బీజేపీ లీడర్ నాగమల్లారెడ్డి ఆధ్వర్యంలో ఇచ్చిన వినతిపత్రం మేరకు.. సోమవారం వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, కమిషనర్ స్వామి, వార్డు కౌన్సిలర్ లు దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో సందర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న నీరు, డ్రైనేజీ, వీధిలైట్లు, రోడ్లు మొదలగు ముఖ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను తీర్చడానికి మున్సిపాలిటీ బడ్జెట్ ను విడుతల వారీగా కేటాయిస్తూ తిరుస్తామని హోమి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ లీడర్ మొర నాగమల్లారెడ్డి, మహిళ మోర్చా అధ్యక్షులు శాంతి, ఉపాధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, సీనియర్ నాయకులు బాపిరెడ్డి, కాలనీ సభ్యులు బాలాజీ మొదలగువారు పాల్గొన్నారు.