ఆన్ లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే చాలా రెస్టారెంట్స్, హోటల్స్ కామన్గా చేసే పనేంటంటే.. బ్లాక్ ప్లాస్టిక్ కంటైనర్స్లో పార్శిల్ చేసి కస్టమర్స్కు డెలివరీ చేస్తుంటాయి. కొంతమంది ఆ ఫుడ్ను ఆ డబ్బాల నుంచి ఇంట్లో ఉన్న ప్లేట్స్లో పెట్టుకుని తింటే.. మరికొందరు మాత్రం నేరుగా స్పూన్తో ఆ డబ్బాల్లోనే తినేస్తుంటారు. ఈ బ్లాక్ ప్లాస్టిక్ కంటైనర్స్ లో వేడి వేడి ఫుడ్ పార్శిల్ చేయడం.. ఆ ఫుడ్ తినడం చాలా ప్రమాదకరమని డాక్టర్ నందితా అయ్యర్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో వివరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది.
If most of the food you’re ordering comes in black plastic containers - you need to watch this video pic.twitter.com/m5VYXUN2VI
— Dr Nandita Iyer (@saffrontrail) February 18, 2026
డాక్టర్ అయ్యర్ ఏం చెబుతున్నారంటే.. బ్లాక్ ప్లాస్టిక్ కంటైనర్లు చాలావరకూ రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి తయారవుతాయి. ఈ వ్యర్థాలలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఇతర ఆహారేతర వస్తువుల నుంచి వచ్చే పదార్థాలు కూడా ఉండే అవకాశం ఉంది. అంటే.. పాడైపోయిన టీవీలు, రిమోట్‌లు, పాత PVCలు.. ఇలా చాలా ఎలక్ట్రానిక్స్ అవశేషాలను రీసైకిల్ చేసి ఈ బ్లాక్ ప్లాస్టిక్ కంటైనర్లను తయారుచేస్తుంటారు. ఈ బాక్సుల్లో వేడి వేడి ఫుడ్ పార్శిల్ చేయడం వల్ల ప్లా్స్టిక్ అవశేషాలు ఆహారంలో కంటికి కనిపించకుండా కలిసే ప్రమాదం ఉంది. ఈ కెమికల్స్ అన్నీ ఫుడ్లో కలిసే అవకాశం లేకపోలేదు.
అలాంటి ఫుడ్ తినడం వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. అలా అని అన్ని బ్లాక్ ప్లాస్టిక్ కంటైనర్లు డేంజర్ అని కాదు. మనం ఆ డబ్బాల్లో ఏం ఉంచుతున్నామనేది పాయింట్. ఆ బ్లాక్ ప్లాస్టిక్ కంటైనర్లలో వేడి వస్తువులను ఉంచినప్పుడే ఆరోగ్యానికి ముప్పు. కిరాణా సామాన్లు.. ఉదాహరణకు.. పప్పులు, కిరాణా వస్తువులు ఉంచడం వల్ల ఏ ప్రమాదం లేదు. వేడి ఆహారాన్ని నిల్వ చేయడం, మళ్లీమళ్లీ వేడి చేయడం ఇలాంటివి ఈ బ్లాక్ ప్లాస్టిక్ కంటైనర్లలో నిల్వ చేయడం మానుకోవడం బెటర్.
