గాంధీ మెడికల్ కాలేజీకి రిటైర్డ్ వ్యవసాయాధికారి మృతదేహం

గాంధీ మెడికల్ కాలేజీకి   రిటైర్డ్ వ్యవసాయాధికారి మృతదేహం

పద్మారావునగర్, వెలుగు: వ్యవసాయ శాఖ రిటైర్డ్​ అడిషనల్ డైరెక్టర్ ఈ.రాఘవరావు(91)వృద్ధాప్య సమస్యలతో ఆదివారం సాయంత్రం అత్తాపూర్ లో కన్నుమూశారు. గతంలో ఆయన చేసిన డిక్లరేషన్ ప్రకారం ఆయన డెడ్​బాడీని కుటుంబసభ్యులు సోమవారం గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించారు. వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం డొనేట్ చేసినట్లు ఫ్యామిలీ మెంబర్స్ తెలిపారు. మెడికల్​  కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్​ ఇందిర, అనాటమీ ప్రొఫెసర్​ సుధాకర్ బాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్​ డాక్టర్​ సంగీత, ఎంపీహెచ్​వో వేణుగోపాల్ గౌడ్ పాల్గొన్నారు.