హైదరాబాద్, వెలుగు: రిటైర్డ్ ఐపీఎస్, ప్రస్తుత భద్రత, ఆరోగ్య భద్రతా విభాగాల కార్యదర్శి ఆల గోపాల్ రెడ్డి (80) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ నానక్‌రామ్ గూడలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. పోలీస్ శాఖలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా చేరిన గోపాల్ రెడ్డి, ఐపీఎస్ అధికారిగా ఉద్యోగ విరమణ పొందారు.
గత 20 ఏండ్లపాటు భద్రత, ఆరోగ్య భద్రత విభాగాల కార్యదర్శిగా పనిచేశారు. గోపాల్ రెడ్డి మృతిపై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకున్న డీజీపీ.. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.
