రోడ్ల మీద చెత్త పారేస్తే రిటర్న్ గిఫ్ట్..! మున్సిపాలిటీ అధికారుల హెచ్చరిక

రోడ్ల మీద చెత్త పారేస్తే రిటర్న్ గిఫ్ట్..! మున్సిపాలిటీ అధికారుల హెచ్చరిక

బెంగళూరు: రోడ్ల మీద చెత్త పారేసేవాళ్లకు చెక్‌‌ పెట్టేందుకు బెంగళూరు మున్సిపల్‌‌ అథారిటీ సిద్ధమైంది. సిటీ క్లీన్‌‌గా ఉండాలంటే మనమే మారాలంటూ చెత్త డంపింగ్‌‌ ఫెస్టివల్‌‌ను మొదలుపెట్టింది. ఎవరైనా రోడ్ల మీద చెత్త పడేస్తే, అదే చెత్తను రిటర్న్​ గిఫ్ట్‌‌గా పంపిస్తామని హెచ్చరించింది. సీసీ కెమెరాల ద్వారా గమనించి పడేసిన చెత్తను వాళ్ల ఇంటికే తీసుకెళ్లి డంప్‌‌ చేస్తామని చెప్పింది. రూ.2 వేల పెనాల్టీ కూడా విధిస్తామంది.

చెప్తే విననోళ్లకు ఇదే కరెక్ట్‌‌.. 

ఇప్పటికే ఇంటింటికీ తిరిగి తడి చెత్త, పొడి చెత్త గురించి అవేర్నెస్‌‌ కల్పిస్తున్నామని, సోషల్‌‌ మీడియాలోనూ అవగాహన కల్పిస్తున్నామని బెంగళూరు సాలిడ్‌‌ వేస్ట్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ లిమిటెడ్‌‌ చీఫ్‌‌ ఎగ్జిక్యూటివ్‌‌ ఆఫీసర్‌‌‌‌ కరిగౌడ తెలిపారు. సిటీలో ప్రతిరోజు 5 వేల ఆటోలు ఇంటింటికీ తిరిగి చెత్త కలెక్ట్ చేస్తున్నాయన్నారు. ఆటోలు వెళ్లని ప్రాంతాల్లో చెత్త డబ్బాలు ఏర్పాటు చేశామన్నారు. 

అయినప్పటికీ కొందరు రోడ్లమీద చెత్త పడేస్తున్నారని, వారికి గుణపాఠం చెప్పేందుకే చెత్త డంపింగ్ ఫెస్టివల్‌‌ ప్రారంభించామన్నారు. వారికి ఇదొక రిటన్‌‌ గిఫ్ట్‌‌ లాంటిదని అన్నారు. తరచుగా చెత్త పడేసే ప్రాంతాల్లో నిఘా కోసం సీసీటీవీలను ఏర్పాటు చేశామని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త పడేస్తే, వాళ్లింటిముందే ఆ చెత్తను డంప్‌‌ చేస్తామన్నారు. సిటీని క్లీన్‌‌గా ఉంచాలని, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయొద్దని ఆయన బెంగళూరు ప్రజలను అభ్యర్థించారు.