విజయారెడ్డి హత్యపై సీఎం స్పందించకపోవడం బాధాకరం: రేవంత్

విజయారెడ్డి హత్యపై సీఎం స్పందించకపోవడం బాధాకరం: రేవంత్

తహసీల్దార్ విజయారెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.  అధికార పార్టీ నేతల ఓత్తిడి వల్లే విజయా రెడ్డి హత్యకు గురైందన్నారు. విజయా రెడ్డి హత్యకు గురవ్వడం దారుణమన్నారు.  రెవెన్యూ డిపార్ట్ మెంట్ పై  సీఎం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే రెవెన్యూ ఉద్యోగులు చులకనయ్యారన్నారు. ఐదు వందల ఎకరాల భూ వివాదాల్లో ఈ ఘటన జరిగిందన్నారు. ఈ భూ వివాదంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ శాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉందని..సంబంధిత అధికారి చనిపోయి 24 గంటలైనా  ఇంతవరకు స్పందించకపోవడం బాధాకరమన్నారు.

పరోక్షంగా, ప్రత్యక్షంగా విజయారెడ్డి హత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. విధుల నిర్వహణలో హత్యకు గురైన విజయారెడ్డి  అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో జరిపించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నారు. ఈ ఘటనపై ఎలాంటి పోరాటానికైనా కాంగ్రెస్ మద్దతిస్తుందన్నారు రేవంత్.