కాంగ్రెస్ చేసే యుద్ధానికి రైతులు అండగా ఉండాలె

కాంగ్రెస్ చేసే యుద్ధానికి రైతులు అండగా ఉండాలె

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ చేయబోతున్న యుద్ధానికి రైతులు అండగా నిలబడాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు. బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయమని రైతులు అడుగుతుంటే ధర్నాల పేరుతో ఆ రెండు పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్న ఆయన.. పాలనాపగ్గాలు చేపట్టాక రైతుల కోసం ఏం చేయబోతున్నామన్నది రాహుల్ సభలో ప్రకటిస్తామని చెప్పారు. అన్నదాతలకు అన్ని రకాల సబ్సిడీలు అందిస్తామని హమీ ఇచ్చారు. వరంగల్ సభకు రాష్ట్రంలోని రైతు కుటుంబాలన్నీ తరలిరావాలని పిలుపునిచ్చారు. రాబోయే సోనియమ్మ రాజ్యంలో 2004నాటి బంగారు పాలన అందిస్తామని చెప్పారు.

కేసీఆర్ అవినీతికి అవధుల్లేకుండా పోయిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. చివరకు యాదగిరి నర్సింహ స్వామి దేవాలయ నిర్మాణంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. రూ.2000కోట్లతో నిర్మించిన దేవాలయంలో కేసీఆర్ కుటుంబ అవినీతి దాగి ఉందని రేవంత్ మండిపడ్డారు.అమరవీరుల స్థూపం విషయంలోనూ ఇదే జరగుతోందన్న ఆయన.. రూ.62 కోట్లతో మొదలుపెట్టిన పనులు, రూ.200కోట్లు చెల్లించినా పూర్తి కాలేదని అన్నారు. కేసీఆర్ కుటుంబ సంపద నిజాం వారసుల సంపదను మించిపోయిందని సటైర్ వేశారు.

మరిన్ని వార్తల కోసం..

దేశద్రోహం పిటిషన్లపై విచారణ మే 10కి వాయిదా

హర్యానాలో నలుగురు ఉగ్రవాదుల అరెస్ట్