దేశద్రోహం పిటిషన్లపై విచారణ మే 10కి వాయిదా

దేశద్రోహం పిటిషన్లపై విచారణ మే 10కి వాయిదా

న్యూఢిల్లీ : దేశ ద్రోహ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు ప్రకటించింది. కేసు తదుపరి విచారణను మే 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ విషయంలో కేంద్రం తీరుపై అత్యున్నత న్యాయస్థానం అహసనం వ్యక్తం చేసింది. ఈ అంశంపై గంతంలోనే కేంద్రానికి నోటీసులు జారీ చేసినా ఇంత వరకు ఎందుకు సమాధానం ఇవ్వలేదని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. డ్రాఫ్ట్ నివేదికకు ఇంకా ఆమోదం లభించలేదని, అందుకు మరింత సమయం కావాలని కోర్టును కోరారు. దీంతో సీజేఐ విచారణను మే 10వ తేదీకి వాయిదా వేశారు. కేసులో మరిన్ని వాయిదాలు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

మరోవైపు దేశద్రోహం కేసుకు సంబంధించి దాఖలైన పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసే అంశంపై ధర్మాసనం అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అభిప్రాయం కోరింది. దీనిపై స్పందించిన ఏజీ హనుమాన్ చాలీసా చదువుతామన్న వారిపై కూడా దేశద్రోహం కేసులు పెడుతున్నారని, అందుకే చట్టం దుర్వినియోగం కాకుండా మార్గదర్శకాలు జారీ చేయాలని, దీనిపై విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయాల్సిన అవసరంలేదని అభిప్రాయపడ్డారు. 

దేశ ద్రోహ చట్టం 124ఏ రాజ్యాంగబద్దతను సవాల్ చేస్తూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, మాజీ మేజర్ జనలర్ ఎస్ జీ వాంబత్ కెరెతో పాటు మరికొందరు గతేడాది జులైలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీటిని విచారణకు స్వీకరించిన సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. బ్రిటీష్ అధికారులు ఉపయోగించిన ఈ చట్టాన్ని కేంద్రం ఎందుకు రద్దు చేయడంలేదని ప్రశ్నించారు. ఈ మేరకు కేంద్రానికి నోటీసులు జారీ చేశారు.

For more news..

తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నిక షెడ్యూల్ రిలీజ్

హర్యానాలో నలుగురు ఉగ్రవాదుల అరెస్ట్