
రాష్ట్రంలో రాజ్యసభ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఇటీవల టీఆర్‌ఎస్ నేత బండ ప్రకాష్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఖాళీ అయిన ఆ స్థానాన్ని భర్తీ చేసే ప్రక్రియను ఈసీ ప్రారంభించింది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. మే 12న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. 19వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మే 30న పోలింగ్ నిర్వహించనున్నారు. ఓటింగ్ ప్రక్రియ ముగిన అనంతరం ఓట్ల లెక్కింపు జరగనుంది.