మల్కాజ్‌‌‌‌‌‌‌‌గిరిలో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌, బీజేపీ ఉనికి ఉండొద్దు

మల్కాజ్‌‌‌‌‌‌‌‌గిరిలో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌, బీజేపీ ఉనికి ఉండొద్దు
  • కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరిన బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్, టీడీపీ లీడర్లతో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు :  మల్కాజ్‌గిరిలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ఉనికి లేకుండా చేయాలని కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గతంలో తనకిచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీ ఇచ్చి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఎల్బీ నగర్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, కూక ట్‌పల్లి నియోజకవర్గాలకు చెందిన బీఆర్‌‌ ఎస్, టీడీపీకి చెందిన క్యాడర్‌‌తో పాటు పలువురు కమ్మ సంఘం నాయకు లకు సీఎం రేవంత్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా దూసుకు పోతున్నదని చెప్పారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల్లో గెలిచే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్‌ అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల దాటికి తట్టుకో లేక బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అడ్రస్ లేకుండా పోయే పరిస్థితిలో ఉందన్నారు. పార్టీలో చేరిన వారిలో టీడీపీ నేత కృష్ణ ప్రసాద్, తెలంగాణ కమ్మ సంఘం నాయకులు బి.రవిశంకర్, అరికెపూడి ప్రసాద్ (మేడ్చల్), బోడు వెంకటేశ్‌ యాదవ్ (కుత్బుల్లాపూర్), మాజీ కార్పొరేటర్లు శాలిని, పావని రెడ్డి, రమణారెడ్డి, మాజీ ఎంపీపీ సి.దేవేందర్ రెడ్డి ఉన్నారు.